Sunday, May 19, 2024
- Advertisement -

ఇంటెలిజెంట్ కాదు….. రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైనర్ అనే టైటిల్ కరెక్ట్

- Advertisement -

వరుసగా నాలుగు ఫ్లాపులు వచ్చాయని స్వయంగా సాయి ధరమ్ తేజ్‌నే ఒప్పుకోవడం గొప్ప విషయం. అయితే నాలుగు ఫ్లాప్స్ తర్వాత సాయి ఎంచుకున్న రూట్ ఏంటి? కచ్చితంగా సక్సెస్ కొట్టాల్సిన పరిస్థితుల్లో ఇంటెలిజెంట్ సినిమా సెలక్ట్ చేసుకోవడం కరెక్టేనా? వినాయక్ సామర్థ్యంపై ఎన్నో అనుమానాలు ఉన్న నేపథ్యంలో తాజాగా రిలీజ్ అయిన ఇంటెలిజెంట్ సినిమా ట్రైలర్ సినిమాపై హోప్స్ పెంచిందా?

నిజానికి ఇంటెలిజెంట్ సినిమా ట్రైలర్ ఒకే. రొటీన్ మాస్ ఎంటర్టైనర్స్‌ని ఇష్టపడేవారికి బెటర్‌గానే అనిపిస్తుంది. అయితే వాళ్ళకు కూడా ట్రైలర్ చూసిన వెంటనే అసలు విషయం ఏంటో అట్టే అర్థమైపోతుంది. ఇక సినిమా థియేటర్‌లో కూర్చున్న అరగంటలోపే మొత్తం కథ తెలిసిపోయే ప్రమాదం ఉంది. విజువల్స్, మేకింగ్ పరంగా చూస్తే వినాయక్‌ని పెద్దగా తప్పుపట్టడానికి ఏమీ లేదు. కానీ కథ ఎంపిక విషయంలో మాత్రం తేజూ, వినాయక్‌లిద్దరూ కూడా మరో పాత చింతకాయపచ్చడి కథతో వస్తున్నారని తెలిసిపోతుంది. అలాంటి పాత కథతో వస్తూ ఉన్నప్పుడు సినిమాకు ఇంటెలిజెంట్ అన్న టైటిల్ పెట్టడం మాత్రం కచ్చితంగా సినిమాకు మైనస్ అయ్యేదే. హీరోని ఇంటెలిజెంట్ అని టైటిల్‌లో చెప్పేస్తే సినిమాలో కూడా సదరు హీరోగారి ఇంటెలిజెన్స్ చూద్దామనుకుంటారు ప్రేక్షకులు. కానీ ఆ హీరోగారు మాత్రం ఇంటెలిజెన్స్ గట్రా ఏమీ లేని వాడు. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. హ్యాపీగా సాగుతున్న తన జీవితాన్ని డిస్టర్బ్ చేసిన విలన్స్‌పై ప్రతీకారం తీర్చుకుని శుభం కార్డ్ వేసేవాడు అయితే ప్రేక్షకులు డిసప్పాయింట్ అవ్వరా? అన్నీ కూడా శారీరక ఫైట్సే తప్ప…..ఇంటెలిజెన్స్‌కి పెద్దగా అవకాశంలేని కథ, కథనాలకు ఇంటెలిజెంట్ టైటిల్ అవసరమా? ఇదే ఈ సినిమాకు అతి పెద్ద మైనస్ అవబోతోంది. అలా కాకుండా రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైనర్ అన్న అర్థం వచ్చేలా టైటిల్ ఉంటే బాగుండేది. ఇక మెగా ఫ్యాన్స్‌కి సినిమా కాస్త బోర్ కొట్టినప్పుడల్లా పెద్ద మామయ్య చిరంజీవి సాంగ్, చిన మామయ్య పవన్ కళ్యాణ్ విజువల్స్‌ని సాయి గట్టిగానే వాడేసినట్టున్నాడు. రామ్ చరణ్ రచ్చ సినిమా టైప్‌లో బోర్ కొట్టకుండా సాగిపోయే కథనం ఉంటే మాత్రం మెగా ఫ్యాన్స్ అండతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సోసోగా నిలబడొచ్చు. అంతకుమించి అద్భుతాలు ఆశించడానికి ఏమీ లేదు. తేడా వస్తే మాత్రం కంప్లీట్ వాష్ అవుట్ అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు.

సాయికి వచ్చిన హిట్స్ అన్నీ కూడా మాస్ సినిమాలతోనే వచ్చాయి కానీ పిల్లా నువ్వు లేని జీవితంలాంటి సినిమాల్లో స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది, చాలా విషయం ఉంటుంది. అవేమీ లేకుండా నేను కూడా ఫైట్స్, డ్యాన్స్‌లు బాగా చేస్తే చాలు…….ప్రేక్షకులు హిట్టిచ్చేస్తారు అని సాయి ధరమ్ ఫీలయితే మాత్రం ఫ్లాపుల నంబర్ ఇంకా ఎక్కువ అవుతూనే ఉండడం మాత్రం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -