Saturday, May 18, 2024
- Advertisement -

‘ఇంటలిజెంట్’ రివ్యూ

- Advertisement -

వరుస ఫ్లాపులతో ఉన్న మెగా హీరో ఎవ‌రంటే సాయిధ‌ర‌మ్ తేజే. కెరీర్ ప్రారంభం కూడా ఫ్లాప్‌తో మొద‌ల‌య్యాడు. ఆ త‌ర్వాత సుప్రీమ్ ఒక్క‌టే హిట్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత అన్నీ అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాలే. అయినా ప్ర‌శాంతంగా సినిమాలు చేసుకుంటూ తేజ్ ఉన్నాడు. ప్ర‌స్తుతం టాప్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఇంటలిజెంట్’ సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌చ్చాడు. ఆ సినిమా అతడి కెరీర్‌కు ఉప‌యోగ‌ప‌డిందా? వ‌వీవీ వినాయ‌క్‌తో క‌లిసి హిట్ కొట్టడా లేదో చూద్దాం..!

కథ: సాయిధరమ్‌తేజ్ తన చిన్నతనం నుంచే చుట్టూ ఉన్నవారికి మంచి చేస్తే అదే సమాజానికి మంచి అని నమ్మే నాజర్ మాటలకి ఆకర్షితుడవుతాడు. నాజర్ ప్రోద్బలంతో బాగా చదువుకుని ఆయన సంస్థలోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవుతాడు. అయితే బిజినెస్ లో ఆదర్శాలు పాటిస్తూ తమ సంస్థల మనుగడకే ప్రశ్నార్ధకంగా మారిన నాజర్ సంస్థని ఎలాగైనా అతడి నుండి లాక్కోవాలనే ఉద్దేశ్యంతో ఆయన పోటీదారులు విక్కీ భాయి అనే మాఫియా డాన్ సహాయం కోరతారు. విక్కి తన మనుషులని పంపి నాజర్ ని బెదిరించడం దానికి ఆయన తలొగ్గకపోవడం జరుగుతుంది. ఇది జరిగాక, ఒక రోజు ఆయన తన కంపెనీ ని విక్కీ భాయికి రాసిచ్చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దీనికి కారణమైన వారి అంతుచూడడానికి ధర్మా భాయిగా మారతాడు హీరో. విక్కి భాయిని ఎలా పట్టుకున్నాడు? నాజర్ చనిపోవడానికి కారణమేంటి? ఇవి తెరపైన చూడాల్సిందే..

సాయిధరమ్‌ తేజ్ తన న‌ట‌న చేశాడు. తన నటన చూపించ‌డానికి అవ‌కాశం లేదు. లావణ్య త్రిపాఠి ఉందంటే ఉంది. నాజర్, సప్తగిరి, బ్రహ్మానందం, రాహుల్ రామకృష్ణ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రచయిత ఆకుల శివ కాంట్రాక్ట్ కిల్లర్ పాత్ర కొంచెం ఆక‌ట్టుకుంది. స‌ప్త‌గిరి కామెడీ ఒక్క‌టే సినిమాలో న‌చ్చిన విష‌యం.

వీవీ వినాయక్ త‌న‌శైలి సినిమానే తీశాడు. కానీ బలహీనమైన కథ, కథనంతో ఆక‌ట్టుకులేక‌పోయాడు. తనకున్న అనుభవం మొత్తం పెట్టి ప్రయత్నం చేసిన ఈ చిత్రం ఆక‌ట్టుకోలేకపోయింది. ఎంటర్టైన్‌మెంట్, యాక్షన్ కలిపి తనదైన శైలిలో తీయాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు. ఇక చిరంజీవి సూప‌ర్ పాట చమక్ చమక్ చమ్ పాట విసుగుతెప్పించేలా ఉంది. పాటలో హీరో-హీరోయిన్ చేసిన డ్యాన్సులు ఆ పాటపై ఆస‌క్తి త‌గ్గుతుంది. సాయిధరమ్ తేజ్ వ‌రుస‌గా నాలుగో ఫ్లాప్‌గా నమోదు చేసుకుంది. తమన్ నేపథ్య‌ సంగీతం, పాటలు ఒకే.

న‌టీన‌టులు: సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్, బ్రహ్మానందం, పోసాని ముర‌ళీకృష్ణ తదితరులు
దర్శకుడు: వీవీ వినాయక్
కథ: ఆకుల శివ
నిర్మాత: సి. కల్యాణ్ (సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌)
సంగీతం: తమన్

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -