Wednesday, May 15, 2024
- Advertisement -

నాగసౌర్యకు సాయిపల్లవి సూపర్ కౌంటర్….

- Advertisement -

సక్సెస్, ఫెయిల్యూర్స్ పూర్తిగా అశాశ్వితం……ఈ రోజు సక్సెస్‌లో ఉన్నవాడు రేపు అథఃపాతాళంలో ఉండొచ్చు అనేదానికి ఎన్నో ఉదాహరణలు కళ్ళముందు కనిపిస్తూ ఉన్నా సినిమా జనాలు మాత్రం సక్సెస్ మైకంలో కొట్టుకునిపోతూ ఉంటారు. బాహుబలి సినిమా కమర్షియల్ సక్సెస్ తర్వాత రాజమౌళి కూడా అలానే రెచ్చిపోయి శ్రీదేవి గురించి వెకిలిగా మాట్లాడేశాడు. ఇక బోలెడన్ని ఫ్లాప్స్ తర్వాత ఛలో సినిమాతో ఓ మోస్తరు హిట్ కొట్టిన హీరో నాగశౌర్య కూడా తనతో కలిసి నటించిన సాయిపల్లవిపై అదే స్థాయిలో రెచ్చిపోయాడు. అయితే అప్పట్లో రాజమౌళికి తన హుందాతనంతోనే దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన శ్రీదేవిలానే సాయిపల్లవి కూడా శౌర్యాకు కౌంటర్స్ ఇచ్చింది.

బాహుబలి సినిమాకి శ్రీదేవిని అడిగామని, రెమ్యూనరేషన్ భారీగా అడిగిందని…శ్రీదేవిని తీసుకుని ఉంటే సినిమా పోయేదని వెకిలిగా మాట్లాడేశాడు రాజమౌళి. ఆ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అంతకంటే వెకిలిగా వ్యవహరించాడు. అయితే శ్రీదేవి మాత్రం చాలా హుందాగా స్పందించి వ్యక్తిత్వం, హుందాతనం విషయంలో రాజమౌళి తనకంటే ఎంత చిన్నవాడో నిరూపించింది. రాజమౌళి సిగ్గుపడేలా చేసింది. ఇక యువ హీరో నాగశౌర్య కూడా సూపర్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవి గురించి ఇష్టారీతిన విమర్శలు చేశాడు. తన స్థాయి మరిచి పోయి దక్షిణాది భాషలన్నింటిలోనూ ప్రతిభావంతురాలైన నటిగా నిరూపించుకున్న సాయి పల్లవి గురించి బ్యాడ్‌గా కామెంట్స్ చేశాడు. అయితే సాయిపల్లవి మాత్రం అప్పట్లో ఏమీ రియాక్టవ్వలేదు. అయితే తాజాగా తన సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన సాయిపల్లవిని నాగశౌర్య కామెంట్స్‌పై స్పందించమని మీడియా అడిగినప్పుడు సాయిపల్లవి చాలా హుందాగా స్పందించింది. ‘నేను ఎవ్వరినీ కావాలని ఇబ్బందిపెట్టనని…..ఒకవేళ నా వళ్ళ నాగశౌర్య ఇబ్బంది పడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతున్నానని చెప్పింది. నా స్థాయి నాకు తెలుసని…..ఇగోతోనో, స్టార్ తాంత్రమ్స్‌తోనో కెరీర్ పాడు చేసుకోవాలని అయితే అస్సలు కోరుకోను‘ అని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. ప్రొఫెషనల్ విషయాల వరకూ నాకు ఇగోలాంటివి అస్సలు ఉండవని చెప్పింది. అయితే పర్సనల్ విషయాల్లో కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే పడి ఉండాల్సిన అవసరం తనకు లేదని, నా నేేచర్ అది కాదని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. సాయి పల్లవి చాలా హుందాగా ఇచ్చిన కౌంటర్స్ విన్నవారికి రాజమౌళికి శ్రీదేవి ఇచ్చిన కౌంటర్స్ గుర్తొచ్చాయి. సక్సెస్ వచ్చిందని విర్రవీగడం, మగాళ్ళం అని రెచ్చిపోవడం కాస్త తగ్గించుకుని ప్రొఫెషనల్ ఎథిక్స్‌కి కట్టుబడి ఉంటే అందరికీ మంచిదని ఈ ఉదంతాలు తెలియచేస్తున్నాయని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -