Thursday, May 16, 2024
- Advertisement -

పాక్‌పై మండిప‌డ్డ‌ ఉత్త‌ర కొరియా….

- Advertisement -
North Korea claims armed Pakistani tax officials beat diplomat

పాకిస్థాన్‌పై ఉత్త‌ర‌కొరియా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌మ దేశానికి చెందిన ఓ రాయబారిని అతని భార్యని దారుణంగా కొట్టారని పాక్‌లోని ఆ దేశ దౌత్యాధికారులు ఆరోపిస్తున్నారు. పాక్‌కి చెందిన పది మంది ఎక్సైజ్‌ శాఖాధికారులు ఏప్రిల్‌ 9న కరాచీలో ఉంటున్న రాయబారి ఇంట్లోకి చొరబడి వారి తలపై గన్ను గురిపెట్టి దాడి చేశారు.ఈ ఘటనపై ఇప్పుడు ఉత్తర కొరియా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.

ఈ చర్యలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోకుంటే మాత్రం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని, కచ్చితంగా దెబ్బతింటాయని హెచ్చరించింది. పాక్‌ పన్నుశాఖకు చెందిన పదిమంది అధికారులు ఆయుధాలు ధరించి కరాచీలోని ఉత్తర కొరియా రాయబారి ఇంటికెళ్లారు.రాయబారిపై దాడి చేయడమే కాకుండా అతడి భార్యను జుట్టుపట్టుకొని ఈడ్చి ఇద్దరిని కొట్టారు.

వారి తలపై తుపాకులు ఎక్కు పెట్టి తీవ్రంగా అవమానించారు. అంతటితో ఆగకుండా గోడకు ఉన్న ఫొటోలపై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఏప్రిల్‌ 9న చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసును తీవ్రంగా భావించిన ఉత్తర కొరియా అంతర్గత వ్యవహారాల మంత్రి పాక్‌కు తీవ్ర హెచ్చరికత లేఖ రాశారు. ఈ సంఘ‌ట‌న‌పై ఉన్నత స్థాయి కమిటీని వేశామని, అరెస్టు చేయకుంటే మాత్రం తామే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి తమకు నచ్చిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక పాకిస్థాన్ మ‌న‌తో వ్య‌వ‌హ‌రించిన‌ట్లు వ్యవ‌హ‌రిస్తాదోలేక చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.

Related

  1. చైనాలో అడ‌వుల‌ను త‌ల‌పించే నిర్మానాలు
  2. జీశాట్ -9 ఉప‌గ్ర‌హం…..
  3. ఉగ్ర‌వాదుల వేట‌కు భారీ సెర్చ్‌ ఆర్మీ అప‌రేష‌న్ సురూ….
  4. బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తూ పాక్ రాయబారికి సమన్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -