సెలెబ్రిటీల పిల్లలు అంటే మీడియా కెమెరా ఎంతసేపూ వారిమీదనే ఉంటుంది. రాబోయే తరానికి కాబోయే స్టార్ లు గా వారిని చూస్తారు జనం. ప్రతీ యాక్టివిటీ వారిది అబ్జర్వ్ చేస్తారు వీరు. మంచి అయినా చెడు అయినా సరే విపరీతంగా స్ప్రెడ్ అయిపోతున్న ఈ రోజుల్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూతురు , కొడుకు లాంటి వారు ఎంత జాగ్రత్తగా ఉండాలి?
ఈ మధ్యనే షారూఖ్ కూతురు సుహాన బికినీ లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేసాయి. సుహాన చాలా చిన్న బట్టలు వేసుకుని నడుస్తున్న ఫోటోలు కనపడ్డాయి. వీటి మీద ఇప్పటికే చాలా కామెంట్లు పడ్డాయి. 16 సంవత్సరాల వయసులో అందాల ఆరబోత కి రెడీ అయిపొయింది అని కొందరు అంటే. ఆమె ఇంకా చిన్న పిల్ల అని మరి కొందరు అన్నారు.
ఇప్పుడు ఈ విషయం మీద షారూక్ స్పందించాడు. ‘ఇప్పుడు సుహాన వయసు 16 ఏళ్లే. అంటే ఇంకా చిన్నపిల్లే. బీచ్ లో తమ్ముడు అబ్రామ్ తో ఆడుకుంటున్నప్పటి ఫోటోలను ఇలా నెట్ లో పెట్టడం.. దాన్ని వివాదం చేయడం దారుణం. దయచేసి వాటిని తొలగించమని అభ్యర్ధిస్తున్నా’ అంటున్నాడు షారూక్.
Related
