విలన్ అజయ్ భార్య చెప్పిన షాకింగ్ నిజాలు

Swetha Ravuri and Ajay Love Story

టాలీవుడ్ లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా బిజీగా ఉన్నాడు అజయ్. ఇప్పుడు ఆయన భార్య శ్వేత రావూరి వల్ల వార్తల్లో ఉంటున్నాడు. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు తల్లిగా ఉంటూనే.. ఫ్యాషన్ డిజైనర్గా ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీలో ఫైనల్ పోటీదారిణిగా నిలిచింది అజయ్ భార్య శ్వేత రావూరి. అజయ్ ప్రేమ వలన ఆమె జీవితం చాలా మలుపులు తిరిందట.

అజయ్ శ్వేతల పెళ్లి  పెద్దలు కుదిర్చినది  కాదు వీళ్ళకు ఒక సినిమా కథ లాంటి ప్రేమ కథ ఉంది అని తెలుసా..? శ్వేత తన ప్రేమ గురించి అజయ్ నిజాయితీ గురించి ఆమె మాటలులోనే.. “నేను ఇక్కడే హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. నాకు మా ఇల్లు నా ఫ్రెండ్స్ తప్పితే వేరే ప్రపంచం తెలియదు. సినిమాలు కూడా తక్కువే చూసేదాన్ని. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అప్పుడుప్పుడు వచ్చి మాట్లాడ్డానికి ప్రయత్నాలు చేసేవాడు.

{loadmodule mod_custom,GA2} 

కొన్నాళ్ళకు అతని నిజాయితీ నచ్చి స్నేహం చేశాను ఆ కుర్రాడే మీరు మెచ్చిన అజయ్” అని చెప్పింది.  ”ఇంకా అక్కడ నుండి అతను నా కాలేజీ వరకు వచ్చి నన్ను దింపటం మళ్ళీ కాలేజీ తర్వాత తోడు రావటం చేసేవాడు. ఇలా కొన్నాళ్ళకు వాళ్ళ ఇంటిలో ఫ్రెండ్ గా పరిచయం చేశాడు. నేను కూడా మా అమ్మకు చెప్పాను నా ప్రేమ గురించి. అంతా వరకు అన్నీ ఇంటిలో వాళ్ళు చెప్పినట్లు చేసిన నేను ఒక్కసారి ఇలాంటి విషయం చెప్పేసరికి బాగానే కోపగించుకున్నారు. అజయ్ నేను కలిసి మా పెద్దవాళ్లను ఒప్పించి మాటలాడించి పెళ్లి జరిగేపాటికి ఒక పెద్ద తతంగమే నడిచింది లెండి” అంటోంది శ్వేత. ‘నేను డిగ్రీ పూర్తి చేసి అజయ్ ని పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత అజయ్ సపోర్ట్ తో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను ఇప్పుడు తన సపోర్ట్ తో మిసెస్ ఇండియా పోటీలో పాల్గొన్నాను” అని చెబుతూ ఏది ఏమైనా నన్ను పెళ్లి చేసుకున్నాకే అజయ్ కి మంచి అవకాశాలు వచ్చాయి తెలుసా అని గారాలు పోతుంది కూడా శ్వేత రావూరి. విక్రమార్కుడులో విలన్ గా.. తరువాత ఇష్క్ లో అన్నయ్యగా.. జనతా గ్యారేజ్ లో గ్రూపు మెంబర్ గా.. కాటమరాయుడులో తమ్ముడిగా.. ఇలా పెద్ద పెద్ద సినిమాలలో బిజీ ఆర్టిస్ట్ గా అజయ్ కెరియర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. 

{youtube}I5kGcgZ-zuA{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి షాకింగ్ నిజాలు
  2. భ‌ర‌త్ సినిమాల్లోకి రాక‌ముందు మీకు తెలియ‌ని నిజాలు….
  3. అక్క కోసం వెళ్ళి.. చెల్లిని చేసుకున్న త్రివిక్రమ్.. బయటకు వచ్చిన నిజాలు
  4. షకలక శంకర్ తో గొడవపై నిజాలు చెప్పిన అప్పారావు