Monday, April 29, 2024
- Advertisement -

సొంత‌పార్టీ నేత‌ల‌తోనే ఇబ్బందుల‌న్న చంద్ర‌బాబు….

- Advertisement -
YS Jagan phobia to AP CM Chandrababu Naidu

ఏపీ సీఎం నారాచంద్ర‌బాబు నాయుడికి ఇప్పుడు జ‌గ‌న్ ఫోబియా ప‌ట్టుకున్న‌ట్లుంది.తాజాగా క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో ఎక్కువ‌గా వైసీపీ గురించే చ‌ర్చించారంట‌.

ప్ర‌తిప‌క్ష‌పార్టీతో న‌ష్టం లేద‌ని…తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.ఎవ‌రైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలు చ‌నిపోతే పోటీ పెట్ట‌కూడ‌ద‌నే సంప్ర‌దాయాన్ని వైసీపీ మ‌ర‌చింద‌ని బాబు స‌మావేశంలో వ్యాఖ్యానించారంట‌.

{loadmodule mod_custom,GA1}

భూమా నాగిరెడ్డి మృతిచెందేనాటికి టిడిపిలో ఉన్నమాట వాస్తవమే. అయితే, ఆయన ఏపార్టీ గుర్తుమీద గెలిచారు? ఎన్నికల కమీషన్ వెబ్ సైట్లో గానీ, అసెంబ్లీ రికార్డుల్లో గానీ భూమా నాగిరెడ్డి వైసీపీ సభ్యుడే కదా? కాదని చంద్రబాబు అనగలరా? అంతెందుకు, వైసీపీ నుండి ఫిరాయించిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీల్లో ఎవరైనా సరే తాము టిడిపి తరపునే పోటీ చేసి గెలిచామని చెప్పగలరా? అంటె చెప్ప‌లేని ప‌రిస్థితి బాబుది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డమే బాబుకు క‌ల‌సి వ‌చ్చిన అంశం.అటువంటి లొసుగుల‌ను అడ్డంపెట్టుకొని బాబు నాట‌కాలాడుత‌న్నారు.సాంకేతికంగా భూమా నాగిరెడ్డి వైసీపీ సభ్యుడే కాబట్టి నంద్యాల సీటు కూడా వైసీపీదే. మరిక్కడ తూట్లు పొడిచింది ఎవరు?
రెండో అంశం వైసీపీ ఇబ్బందుల్లో ఉందట. వైసీపీ ఇబ్బందుల్లో ఉన్నపుడు అసలు ఆ పార్టీని లెక్క చేయాల్సిన అవసరం ఏంటి? మంత్రులు, నేతలతో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కూడా వైసీపీ గురించి, జగన్ గురించే చంద్రబాబు మాట్లాడుతున్నారంటేనే ఇబ్బందుల్లో ఎవరున్నారో స్పష్టమవుతోంది.

{loadmodule mod_custom,GA2}

అయితే, సమస్య అంతా టిడిపి నేతల వల్లే వస్తోందన్న వాస్తవాన్ని కూడా చంద్రబాబు ఒప్పుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన లైసెన్సుల వల్లే నేతలు రెచ్చిపోయి పార్టీ, ప్రభుత్వ పరువును బజారుకీడుస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఆ విషయాన్ని గమనించినందుకు సంతోషం.ఇప్ప‌టికైనా జ‌గ‌న్ మీద దృష్టిసారించి అభివృద్దిపైన దృష్టి సారిస్తే మంచిది.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}RHseQbf0LsE{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -