ఈ హీరోయిన్ ఆ సింగర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ 6 నెలలకే విడాకులు ఇచ్చి….

- Advertisement -

తెలుగులో నూతన దర్శకుడు ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించిన భీమవరం బుల్లోడు అనే చిత్రం లో టాలీవుడ్ ప్రముఖ హీరో కమెడియన్ సునీల్ సరసన ఆడిపాడిన ముంబై బ్యూటీ ఎస్తర్ నోరాన్హా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు మొదటగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్  శంకర్ హీరోగా నటించినటువంటి 1000 అబద్దాలు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఆ తర్వాత భీమవరం బుల్లోడు చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుని తన నటనా ప్రతిభను నిరూపించుకుంది.

అయితే ప్రస్తుతం ఒకప్పటి ప్రముఖ శృంగార తార షకీలా జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్నషకీలా అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఎస్తర్ పాల్గొంది. ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలతో పాటు తన వైవాహిక జీవితం గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. తాను సినిమా పరిశ్రమకి అనుకోకుండా వచ్చానని చెప్పాలంటే   తాను మంచి సింగర్ అని తెలిపింది. ఆ తర్వాత మన జీవితంలో ఏది రాసి పెట్టిందో అదే జరుగుతుందని తప్ప మనం విధి రాతను మార్చలేమని తెలిపింది. ఇక షకీలా చిత్రంలో తన  పాత్ర చాలా బాగుంటుందని అంతేగాక షకీలా చిత్రం ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుందని తెలిపింది. అయితే ప్రత్యక్షంగా  ఎస్తర్ తన విడాకుల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయక పోయినప్పటికీ తన జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి చెడు జరగలేదని అంతా  ఆ దేవుడు మంచి చేశాడని చెప్పుకొచ్చింది.

- Advertisement -

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఎస్తర్ నోరాన్హా దాదాపుగా ఐదు చిత్రాలలో నటిస్తోంది. ఇందులో షకీలా చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో తెరకెక్కుతుండగా “లోకల్ ట్రైన్” అనే మరో కన్నడ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తి అయినట్లు సమాచారం.

ఈ నాగార్జున కూతురు ఇప్పుడు ఎలా ఉందో అవక్కవుతారు…

మహేశ్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్ మాజీ భార్య!

నాలుగు పెద్ద సినిమాల నుంచి తప్పించారు.. అనసూయ షాకింగ్‌ కామెంట్స్‌

విక్టరీ వాకిట్లో నందుల పంట

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...