Wednesday, May 22, 2024
- Advertisement -

టాలీవుడ్ లో మరో విషాదం

- Advertisement -

సినీనటుడు, సీనియర్ రాజకీయనాయకుడు నందమూరి హరికృష్ణ మృతి విషాదం నుంచి తెలుగు సినీ పరిశ్రమ కోలుకోకముందే మరో విషాదం టాలీవుడ్ లో చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకురాలు బి. జయ (54) గురువారం రాత్రి 11గంటల సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలోని ఆమె సొంతింటిలో ఈ విషాదం చోటు చేసుకుంది. జర్నలిస్ట్ గా కెరీరీ ఆరంభించిన జయ మొదట్లో సినీవార్తలు ప్రధానంగా రాసేవారు. ప్రముఖ సినీవారపత్రిలో పనిచేశారు. ఆ అనుభవంతో ప్రస్తుతం ఆమె సొంతంగా సూపర్ హిట్ అనే సినీ వారపత్రికను నడుపుతున్నారు. సినిమా దర్శకురాలిగా కూడా జయ తనని తాను నిరూపించుకున్నారు. బాలాదిత్య, సుహాసిని జంటగా 2003లో జయ చంటిగాడు సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా హిట్ అవడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. తర్వాత వరసుగా ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ సినిమాలకు దర్శకత్వం వహించారు జయ. వాటిలో లవ్లీ మాత్రం కాస్త పేరు తెచ్చింది. మిగిలినవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. గతేడాది వైశాఖం అనే చిత్రాన్ని స్వీయదర్శకత్వంతో పాటు నిర్మాతగానూ మారి నిర్మించారు. ఆమె భర్త బియే రాజు కూడా సినీ పాత్రికేయుడే. పీఆర్ఓగా వ్యవహరిస్తున్నారు.

ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ సైకాలజీ చేసిన జయ జర్నలిస్టే కాదు మంచి ఎడిటర్ కూడా. తన సినిమాలకు తానే స్వయంగా ఎడిటింగ్ చేసుకునేవారు. ఇంతవరకూ ఐదు సినిమాలకు దర్శకత్వం ఓ సినిమాకు దర్శకత్వం నిర్మాతగా బాధ్యతలు వహించిన జయ ప్రముఖ హీరోయిన్ కామ్నజెఠ్మలాని, శాన్వి, సుహాసిని వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత వాళ్లంతా మంచి అవకాశాలను దక్కించుకున్నారు. బి జయ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మహిళా దర్శకులు తక్కువగా ఉన్న ఇండస్ట్రీలో ఆమె తనదైన ముద్ర వేశారని, ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పంజాగుట్ట శ్మశాన వాటికలో జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -