Wednesday, May 15, 2024
- Advertisement -

‘ఉంగరాల రాంబాబు’ మూవీ రివ్యూ

- Advertisement -

సునీల్ హీరో గా.. ఓనమాలు , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి లాంటి మంచి సినిమాలు తీసిన దర్శకుడు క్రాంతి మాధవ్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఉంగరాల రాంబాబు. మరి ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అయిన సునీల్ కి హిట్ ఇచ్చిందో లేదో చూద్దాం..

కథ :

రాంబాబు(సునీల్)కి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో.. తాత దగ్గరే పెరుగుతాడు. రాంబాబు తాత చనిపోవడంతో అనాధ అవుతాడు. ఆ తర్వాత తన పేరు మీద ఉన్న 200కోట్ల ఆస్తిని.. బాదం బాబా(పోసాని)ను కలవడం వల్ల రాంబాబు ఆస్తి కలిసివస్తోంది. ఇక అప్పటి నుండి బాబాని బాగా నమ్ముతాడు. తర్వాత రాంబాబు ట్రావెల్స్ ను ప్రారంభిస్తాడు. అదే ఆఫీస్ లో సావిత్రి(మియా) అమ్మాయికి మేనేజర్ గా జాబ్ ఇస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రేమలో రాంబాబు పడతాడు. కట్ చేస్తే.. అతని ప్రేమని ఒప్పుకున్నా.. ఆమె తన తండ్రిని ఒప్పిస్తేనే పెళ్లి అంటుంది. అయితే సగటు ఆడపిల్ల తండ్రి తన కూతుర్ని అన్ని విధాలుగా సుఖపెట్టగల వారికోసం చూస్తాడు. కానీ ఈ సావిత్రి తండ్రి ( ప్రకాష్ రాజ్ ) ఓ కమ్యూనిస్ట్. అతడు కాబోయే అల్లుడి నుంచి అంతకు మించి కోరుకుంటాడు. రాంబాబుకి ఎన్నో పరీక్షలు పెడతాడు. భిన్న ధృవాల్లాంటి ఈ మామ అల్లుళ్ళు చివరికి ఏమి అవుతారు అన్నదే ఉంగరాల రాంబాబు కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయంకు వస్తే.. సునీల్ అదరగొట్టగా.. ప్రకాష్ రాజ్ చాలా బాగా నటించాడు. సునీల్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. కామెడీ, డాన్స్, యాక్షన్ సీన్లలో దుమ్మురేపేసాడు. అలానే ఎమోషన్ సీన్స్ లో కూడా నటించాడు. ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. అలానే సునీల్, ప్రకాశ్ రాజ్ ల మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. హీరోయిన్ మియా పర్వాలేదనిపించింది. సునీల్-మియాల కెమిస్ట్రీ పర్వాలేదు. వెన్నెల కిషోర్, పోసానీ తదితర నటినటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమా కథనం పరంగా బాగుంది. ఫస్ట్ పర్వాలేదు అనిపించి.. సెకండాఫ్ లో ఎమోషనల్‌గా ఆకట్టుకున్నారు. అలానే ఈ సినిమాతో ఓ మంచి మెసేజ్‌ను తెలియజేసారు. మన హక్కుల కోసం మనం పోరాటం చేద్దాం అనే పాత్రలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ బాగుంది. క్రమశిక్షణ, సహణం, మంచితనం, సేవాగుణం వంటి అంశాలు కలిగిన వ్యక్తిగా ప్రకాష్ రాజ్ నటన బాగుంది. రాంబాబు తన ప్రేమకోసం మొదలుపెట్టిన ప్రయాణంలో ఎన్నో విషయాలను తెలుసుకుంటాడు. కామెడీ కూడా పర్వాలేదు. సర్వేష్ మురారి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాత పరుచూరి కిరీటీ సినిమాను చాలా బాగా రూపొందించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను గ్రాండ్‌గా తీర్చిదిద్దారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధానంగా మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. సినిమా కథలో దమ్ము లేదు. చాలా రొటిన్ కథ. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమించడం… ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి.. పెద్దలు ఒప్పించడానికి వాళ్ల ఇంటికి వెళ్లడం.. అమ్మాయి వాళ్ల ఫ్యామిలీకి దగ్గరవడం.. వారికి ఏమైనా సమస్యలు వస్తే వాటిని ఎదుర్కొని పోరాడటం.. చివరకు ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల మనసులు గెలుచుకొని ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవడం…ఇలాంటి కథలతో చాలా సినిమాలే వచ్చాయి. కథ విషయంలో సునీల్ కేర్ తీసుకుంటే బాగుండేది. ఫస్ట్ ఆఫ్ లో సినిమా కాస్తా బోర్ గా సాగుతోంది. కామెడీ బాగున్నప్పటికీ.. చాలా మేరకు రొటీన్ కామెడీయే అనిపించే విధంగా వుంది. పాటలు బిగ్గెస్ట్ మైనస్ ఈ సినిమాకి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగాలేదు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త పనిచేయాల్సింది. దర్శకుడు కె. క్రాంతిమాధవ్ పాత కథనే కొత్త కథనంతో చూపించాలనే ప్రయత్నం చేసాడు.

మొత్తంగా :

ఈ సినిమా కథ పాతదే అయిన.. కథనం విషయంలో కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అయితే కథ పాతదే కావడం.. సినిమా చూస్తుంటే వచ్చే సీన్లు ముందే చెప్పడం.. రొటిన్ కామెడీ ఈ సినిమాలో మైనస్ కాగా.. సునీల్ నటన, ప్రకాశ్ రాజ్ నటన, మియా అందాలు ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే.. సునీల్ మార్క్ కామెడీ నచ్చేవాళ్లకు ఈ సినిమా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -