Monday, May 20, 2024
- Advertisement -

ఎవరండీ ఈ కేతిరెడ్డి… ఏమిటా కథ

- Advertisement -

కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. గత కొన్ని రోజులుగా న్యూస్లో సర్కులేట్ అవుతోన్న వ్యక్తి. అన్నిటికీ నేనేనంటూ ముందుకొచ్చి నిలబడే చురుకైన ఉత్సాహవంతుడు. అలాంటి ఆయన తెలుగు రాజకీయాల్లో చిన్న గెస్ట్ రోల్ కూడా దక్కించుకున్నారు. లక్ష్మీస్ వీరగ్రంధం పేరుతో ఎన్టీయార్ బయోపిక్ లాంటిదొక సినిమా తీస్తానంటూ ప్రకటించి.. ఇప్పుడా పనుల్లోనే ఫుల్ బిజీగా మారిపోయారు. తనది మాటలతో పొద్దుపుచ్చే కేటగిరీ కాదని, చేతలతోనే రుజువు చేసుకున్నారు ..

ఎన్టీయార్ జీవితాన్ని బయోపిక్ ల పేరుతో కొందరు నాశనం చేస్తున్నారన్న ఆవేశం ఆయనది. అయితే ఆయన తాజాగా చెప్పిన కొన్ని మాటలు కాక పుట్టిస్తున్నాయి. లక్ష్మీపార్వతి పాత్రకి అయితే… సన్నీ లియోన్ లేదంటే లక్ష్మి రాయ్ ని సంప్రదిస్తానని చెబుతున్నారు కేతిరెడ్డి. తనలోని తెగువ ఎంతనే లెక్కకు ఇదొక మంచి ఉదాహరణ అంటున్నారు. అలాగే ఎవరి మీదనైనా దాడి చేయాలనుకున్నా.. ఎక్కడా తలొగ్గే టైపు కాదు. చిరంజీవి తీయబోతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోగ్రఫీని బైటికి తీసి.. ఆయనకు అల్లూరి సీతారామరాజులా జాతీయ గుర్తింపు ఎందుకు రాలేదంటూ ఢిల్లీని ప్రశ్నించారు. జల్లికట్టుకీ, ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి లంకె పెట్టి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎదురుదాడికి దిగారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ ఉద్యమాలు చేస్తున్నారని చాలాసార్లు ఆరోపించారు.

జయలలిత మరణం మీద అనుమానాలున్నాయంటూ కోర్టుకెక్కినవాళ్లలో ఆయన ఒకరు. 2012లోనే జయ మీద శశికళ విషప్రయోగం చేసిందన్నది ఆయన అభియోగం. జనమంతా.. హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు.. దేశం మొత్తాన్ని వణికిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేశారు. తమిళనాట తెలుగు భాష వాడకాన్ని నిషేధించాలన్న జయ సర్కార్ ప్రయత్నాలను గట్టిగా ప్రశ్నించింది కూడా మన రెడ్డిగారే.

ఇంతకీ.. కేతిరెడ్డి ఎవరు. ఈయనగారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే అనుమానం జనంలో ఈ మధ్యనే ఊపందుకుంది. నిజానికి ఈయన తెలుగువారే అయినప్పటికీ… సెటిలైంది మాతరం… చెన్నపట్నంలోనే. అరవ తెలుగులోనే అదరగొట్టే భాషా ప్రావీణ్యం ఈయన సొంతం. ‘తమిళనాడు తెలుగు యువశక్తి’ వేదికను ఏర్పాటు చేసి.. ద్రవిడగడ్డ మీదున్న తెలుగు వాళ్లందరినీ ఒక దరికి చేర్చడానికి చాలా ప్రయత్నం చేశారు. గతంలో చదువు కోసమో, పొట్టకూటికోసమో చెన్నపట్నం వచ్చే వాళ్లందరికీ తెలుగువాళ్ళ పాలిట ‘అన్నయ్య’లా ఉంటూ కొన్నాళ్లపాటు వాళ్ళ సమస్యల పరిష్కారంలో ముందున్నారు కూడా. చెన్నై కాలేజీల్లో జరిగే స్టూడెంట్స్ యునియన్ ఎలక్షన్స్ లో కూడా తన ఉనికిని చాటుకునేవారు. మీకు తెలుసో లేదో … స్వచ్ఛ భారత్ షురూ కావడానికి పాతికేళ్ల ముందే మద్రాస్ ప్యారిస్ వీధుల్లో చీపురు పట్టి ఊడ్చిన ఘనమైన ఫ్లాష్ బ్యాక్ ఈయనిది. ఏ పార్టీకీ వత్తాసు పలక్కుండా.. ఎవరికి కొమ్ముకాయకుండా… సమస్యలపై పోరాడే కేతిరెడ్డిలోని దాగిన ‘కసి’ గురించి క్లోజ్ ఫ్రెండ్స్ లోనే కాదు తెలిసినవారు కూడా గొప్పగా చెప్పుకుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -