విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ ఆంటోని పేరు.. సౌత్ మొత్తం మారుమోగిపోయింది. విజయ్ గట్స్‌ను అంతా మెచ్చుకున్నారు. సాధారణంగా సౌత్ ఇండియా హీరోలు.. ఇటువంటి పాత్రలు చేసేందుకు ఒప్పుకోవడం ఎంతో అరుదు. అయితే బిచ్చగాడు చిత్రంలో హీరో యాచకుడు. మరోవైపు ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. ఇక ఈ సినిమాలో విజయ్ ఆంటోని నటనకు అంతా ఫిదా అయ్యారు.
వెరసి తమిళంతోపాటు తెలుగులో కూడా ఈ చిత్రం హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ తీయబోతున్నారు. సీక్వెల్‌కు విజయ్ ఆంటోని డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నట్టు టాక్. ఈ మేరకు ఇవాళ ప్రముఖ తమిళ దర్శకుడు ఎఆర్ మురగదాస్ సోషల్ మీడియా వేదికకగా ఓ పోస్ట్ పెట్టాడు.
ఫాతిమా విజయ్ ఆంథోనీ ‘విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. 2022లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. విజయ్ ఆంటోనీ ఒక్క నటుడిగానే కాక.. దర్శకుడు, మాటల రచయిత కూడా. బిచ్చగాడు హిట్ అయ్యింది. ఇక బిచ్చగాడు 2ను ఎలా తెరకెక్కిస్తారో వేచి చూడాలి.
Also Read
ఆసియా ఖండంలో అందగాడు ఎవరో తెలుసా..?
ప్రభాస్ -నాగ్ అశ్విన్ మూవీ షూటింగ్ షురూ.. !
‘ఇంద్ర’ విడుదలై నేటికి 19 ఏళ్లు.. సినిమా విశేషాలివే..!