Thursday, April 25, 2024
- Advertisement -

రెజ్లర్ రితిక ఫొగట్ ఆత్మహత్య

- Advertisement -

ప్ర‌ముఖ క్రీడాకారిణి, జాతీయ రెజ్లర్ రితిక ఫొగ‌ట్ ఆత్మ‌హత్య చేసుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఓట‌మి పాల‌య్యారు. ఈ క్ర‌మంలోనే మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటార‌ని అనుమానిస్తున్నారు. ప్ర‌ముఖ మ‌హిళా రెజ్ల‌ర్లు గీతా ఫొగ‌ట్‌, బ‌బితా ఫొగ‌ట్ సోద‌రి (క‌జిన్‌) అయిన రితికా ఫొగ‌ట్ వ‌య‌స్సు 17 ఏండ్లే.

ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌నే వార్త తెలిసి క్రీడా ప్ర‌పంచం దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది. తాజాగా రాస్థాన్‌లోని భ‌ర‌త్ పూర్‌లో ఈ నెల 12 నుంచి 14 వ‌ర‌కు రెజ్లింగ్ పోటీలు నిర్వ‌హించారు. రాష్ట్ర స్థాయి జూనియ‌ర్ విమెన్‌, సబ్ జూనియ‌ర్ కేట‌గిరీల‌లో రితికా పొగ‌ట్ పాల్గొన్నారు. పోటీల‌లో అక‌ట్టుకున్న రితికా ఫైన‌ల్‌కు చేరుకుంది. మార్చి 14న ఫైన‌ల్ పోటీలు జ‌ర‌గ్గా.. ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఓట‌మి పాలైంది.

ఈ నేప‌థ్యంలోనే ఆమె తీవ్ర మ‌న‌స్థాపానికి గురై త‌న స్వగ్రామ‌మైన బాలాలికి చేరుకుంది. ఈ క్ర‌మంలోనే ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. రాష్ట్ర స్థాయి పోటీలు రితికాకు పెద్ద విష‌యం కాద‌నీ, ఇలాంటి దారుణ నిర్ణ‌యం ఎందుకు తీసుకుందోన‌ని త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని కుటుంబ సభ్యులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. కాగా, రితికా మ‌ర‌ణంపై పోలీసులు కేసు న‌మోదుచేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

రజినీని ఢీ కొట్టబోతున్న జగ్గూభాయ్ !

వీరి కాంబినేషన్ సూపర్ హిట్టే..!

ఆ విషయంలో నేను బాలయ్యకు ఫిదా అయ్యాను

కిడ్నీలల్లో రాళ్లా.. అయితే ఇవి అస్సలు తినకండి !

బాగా చెమ‌ట ప‌డుతుందా..? ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -