Thursday, April 25, 2024
- Advertisement -

బాగా చెమ‌ట ప‌డుతుందా..? ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..!

- Advertisement -

ఎండాకాలం మొదలు కానే అయ్యింది. స్టార్టింగ్ స్టారింగే ఎండలు ఇరగదీస్తున్నాయి. ఇంటినుంచి బయటకు అడుగువెయ్యాలంటే జనాలు జంకుతున్నారు. అందులోనూ వేసవి తాపాన్ని తట్టుకోలేక రకరకాల చల్లటి పానియాలను సేవిస్తూ దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ కాలంలో చాలా మంది అధిక చెమట సమస్యను ఎదుర్కొంటుంటారు.

ఎన్ని ఫ్యాన్లు, కూలర్లు వాడినా.. చెమట మాత్రం ఆగదు. ఇలాంటి వారు కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరి.ఈ సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు. ప్రతి రోజూ ఒక గ్లాసు టమాటా జ్యూస్ ను తాగాలి. ఇలా చేస్తే అధిక చెమట నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ కూడా ఈ అధిక చెమట సమస్యను దూరం చేస్తుంది.

వీటితో పాటుగా రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక కటీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్లను మిక్స్ చేసి.. ప్రతి రోజూ మూడు పూటలా తాగాలి. ఇలా చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే అరటి పండును తీసుకున్నా చక్కటి ఫలితం వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వీటినే కాకుండా గోధుమ గడ్డి జ్యూస్ కూడా ఈ అధిక చెమట సమస్యను దూరం చేస్తుంది.

నాగార్జున‌కు కాజ‌ల్ గ్రీన్‌సిగ్న‌ల్ !‌

ర‌జినీ కాంత్ సినిమాపై క‌రోనా దెబ్బ !

కారును ఢీ కొట్టిన విమానం !

మజ్జిగతో బోలెడు లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు !

సందీప్ రెడ్డి డైరెక్ష‌న్‌లో సూపర్ స్టార్ మ‌హేష్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -