- Advertisement -

Afg vs Ind T20: మీడియా హక్కులు పాకిస్థాన్ కు..

- Advertisement -

అఫ్గానిస్థాన్, భారత్ మధ్య జరగనున్న టీ20 సిరీస్‌కు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన గ్లోబల్ మీడియా హక్కుల సిండికేషన్ బాధ్యతను పాకిస్థాన్‌కు చెందిన సంస్థ ‘ట్రాన్స్‌గ్రూప్’ దక్కించుకుంది.

పాకిస్థాన్‌కు చెందిన ‘ట్రాన్స్‌గ్రూప్’ సంస్థకు పీఎస్ఎల్ (PSL), పీసీబీ (PCB) లతో కూడా బలమైన సంబంధాలు ఉన్నాయి. గత నెల ఆగస్టు 12న అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ఈ సిరీస్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆ సమయంలో తమ వాణిజ్య, ప్రసార భాగస్వాముల వివరాలను ఏసీబీ వెల్లడించింది.

ఈ ప్రకటన ప్రకారం.. ట్రాన్స్‌గ్రూప్ సంస్థ ఏసీబీకి గ్లోబల్ మీడియా రైట్స్ సిండికేషన్ భాగస్వామిగా వ్యవహరించనుంది. అలాగే ‘TPT360’ సంస్థ మీడియా నిర్మాణ భాగస్వామిగా బాధ్యతలు నిర్వర్తించనుంది.

భారత భూభాగంలో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామిగా కూడా వ్యవహరించనున్నట్లు ఏసీబీ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల నేపథ్యంలో పాకిస్థాన్ సంస్థ ఈ హక్కులను దక్కించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -