Thursday, May 16, 2024
- Advertisement -

బాబుకు మరో బిగ్ షాక్..రంగంలోకి కేంద్రం!

- Advertisement -

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ఇప్పుడిప్పుడే ఆశతో ఉన్నారు టీడీపీ నేతలు. అయితే వారికి ఇది గుదిబండలాంటి వార్తే. ఎందుకంటే టీడీపీ హయాంలో జరిగిన అవినీతి కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఎంట్రీ అవుతుందని ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి వైసీపీ నేతలు మొదటి నుండి డిమాండ్ చేస్తుంది ఇదే. సీబీఐతో దర్యాప్తు జరిపితే బాబు అవినీతికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే బాబు అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు.

అవినీతి కేసుల్లో సెప్టెంబర్ 9న అరెస్ట్ అయిన చంద్రబాబు నెల రోజులకు పైగా జైళ్లోనే ఉన్నారు. అప్పటి నుండి బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి ఫలించడం లేదు. సీఐడీ కోర్టు దగ్గరి నుండి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే విచారణ ఏదో కారణంతో వాయిదా పడుతూ వస్తూనే ఉంది. చంద్రబాబుపై పలు కేసులు నమోదుచేయగా ఒక అంగళ్లు కేసులో మాత్రం ముందస్తు బెయిల్ వచ్చింది. ఇది ఒక్కటి తప్ప చంద్రబాబుకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది.

సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం ఓకే అంటోంది. మరి ఈ విచారణ సందర్భంగా కోర్టు కనుక ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తే చంద్రబాబుకు మరిన్ని చిక్కులు తప్పవు. ఒకవేళ సీఐడీకి అప్పగిస్తే తర్వాత ఈడీ కూడా ఎంటర్‌ అవుతుంది. సో మొత్తంగా చంద్రబాబుకు రానుంది గడ్డుకాలమేనని అంతా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -