Thursday, May 16, 2024
- Advertisement -

చంద్రబాబా..మజాకా..పెన్షన్ కటకట

- Advertisement -

ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు..ఏపీలో పెన్షనర్ల ముఖంలో చిరునవ్వులు చూడాల్సిందే. బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు. పెన్షన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. టెన్షన్‌గా ఇంటికి వచ్చే పెన్షన్ ఇచ్చేవారు. దీనికోసం అంతా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కానీ ఇప్పుడు టీడీపీ చంద్రబాబు మోసపూరిత వైఖరి వల్ల ఆ పరిస్థితి లేకుండా పోయింది.

ఎండలకు పిల్లలు పెద్దలు అంతా అల్లాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతీ నెల ఇంటికి వచ్చి ఇచ్చే ఫించన్ డబ్బులు ఈసారి.. బ్యాంకులకు వెళ్లి తీసుకోవాలట. చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రలవల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు..నిలబడడం..ఆ ఫారాలు నింపడం ..ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ ) లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి.

ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే… అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు.

ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక … సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -