Thursday, May 16, 2024
- Advertisement -

భూమా కుటుంబానికి చంద్రబాబు ఝలక్!

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో భూమా నాగిరెడ్డిది ప్రత్యేక స్థానం. ఎన్నిక ఏదైనా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి చట్ట సభల్లో ఉండాల్సిందే. అయితే భూమా నాగిరెడ్డి లేదా ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి ఎవరో ఒకరు ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా కర్నూల్ జిల్లా రాజకీయాలను శాసించారు. ఇక వీరిద్దరి అకాల మరణం తర్వాత ఓ దఫా అఖిల ప్రియ,భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ గాలి ముందు భూమా ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు.

ఇక ఓడినా అప్పటినుండి ఆళ్లగడ్డకు అఖిలప్రియ, నంద్యాలకు భూమా బ్రహ్మానందరెడ్డి ఇంఛార్జీగా ఉంటూ వస్తున్నారు. ఇక ముఖ్యంగా నంద్యాలలో ఈ సారి సీటు తనదే దక్కుతుందని ఆశతో ఉన్నారు బ్రహ్మానందరెడ్డి. అయితే అనూహ్యంగా ఈయనకు టికెట్ కాదని మాజీ మంత్రి ఫరూక్‌కు టికెట్‌ను ఖరారు చేసింది.

భూమా కుటుంబానికి టికెట్ నిరాకరించడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఫరూక్‌కు టికెట్ ఇచ్చి టీడీపీ పెద్ద తప్పు చేసిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఇక ముస్లిం సామాజిక వర్గం నుండి ఫరూక్‌కు తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ బేస్ చేసుకుని చంద్రబాబు టికెట్ ఇచ్చారో తెలియని పరిస్థితి నెలకొనగా నంద్యాలలో టీడీపీ ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. ఇక బ్రహ్మానందరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరుగుతున్నఅది కష్టమే. భూమా ఫ్యామిలీకి టికెట్ నిరాకరించడం ద్వారా ఈ ప్రభావం నంద్యాల ఎంపీ సీటుపై కూడా పడుతుందని..అక్కడ ఓడిపోవడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది అయితే ఏ సర్వేల ఆధారంగా టికెట్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -