Saturday, May 4, 2024
- Advertisement -

అన్నిదారులు క్లోజ్..లిక్కర్ స్కాంలో చంద్రబాబు!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రాజమండ్రి సెంటల్ జైలులో 52 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు. ఇక చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం మాత్రమే కాదు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ తో అంగళ్లు కేసులో బాబు పేరును చేర్చింది ఏపీ సీఐడీ. ఈ కేసులు లైన్‌లో ఉండగానే మరో షాక్ తగిలింది చంద్రబాబుకు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం జరిగిందని తేల్చిన సీఐడీ ఇందులోనూ చంద్రబాబు పేరును చేర్చింది. ఏ1గా ఐఎస్ నరేష్, ఏ2గా నాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఏ3 గా చంద్రబాబు నాయుడి పేర్లు నమోదు చేశారు. లిక్కర్ స్కాకంలో క్విడ్ ప్రో కో తరహా అక్రమాలు జరిగాయని… 5 మద్యం సంస్థలకు లబ్ధి చేకూర్చేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిందని తేల్చిన సీఐడీ ఆయన్ని విచారరించాలని న్యాయస్థానాన్ని కోరింది.

తమకు అనుకూలురైన రెండు బ్రేవరేజ్‌లు, మూడు డిస్టిలరీల నిర్వాహకులకు లబ్ధి చేకూర్చడానికి మద్యం పాలసీనే మార్చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు. 2012 నుంచి 2015 వరకు పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ. 2900 కోట్ల ఆదాయం రాగా 2015లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేశారని వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబును విచారించడానికి అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరడంతో ఇక బాబు బయటకు రావడం కష్టమే. మరిన్ని రోజులు చంద్రబాబు జైలులో ఉండాల్సిన పరిస్థితి తప్పదని అంతా భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -