Saturday, May 18, 2024
- Advertisement -

ఒంగోలు బరిలో చెవిరెడ్డి?

- Advertisement -

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది సీఎం జగన్ దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జీలను ప్రకటించగా తాజాగా ఒంగోలు రేసులో కొత్తపేరు తెరపైకి వచ్చింది. ఒంగోలు ఎంపీ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులుకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.

ఈ క్రమంలో ఒంగోలు ఎంపీ స్థానంలో కొత్తపేరు తెరపైకి వచ్చింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి చంద్రగిరి సీటును చెవిరెడ్డి తనయుడికి ఇవ్వగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా చెవిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో బాలినేని కలిసిన చెవిరెడ్డి ఒంగోలు పార్లమెంట్ నుండి తాను బరిలోకి దిగుతున్నట్లు చెప్పినట్లు సమాచారం.

వైసీపీ పెద్దలు సజ్జలతో పాటు విజయసాయిరెడ్డి ఇవాళ బాలినేనితో భేటీ అయ్యి ఇదే విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. చెవిరెడ్డిని బరిలోకి దించడం ద్వారా జిల్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి చెక్ పెట్టవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది.బాలినేనిని బుజ్జగించి ఒక్క ఎంపీ విషయం తప్ప మిగతా డిమాండ్లకు సానుకూలం వ్యక్తం చేసి అతన్ని ఒప్పించే దిశగా వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు తన అనుచరులతో ఎంపీ మాగుంట కీలక భేటీ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి పేరు తెరపైకి రావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -