Thursday, May 2, 2024
- Advertisement -

బాబు స‌ర్వేపై నాయ‌కుల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌…

- Advertisement -

అధికార పార్టీ టీడీపీ వ‌రుస విజ‌యాల‌తో మంచి జోరుమీదుంది. ఇదే జోరును కొన‌సాగించి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌ని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌కు ఇప్ప‌టికే సంకేతాలు ఇచ్చారు. బాబు స‌ర్వేలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో వారందిరిని ప‌క్క‌న పెట్టేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఈ వార్త ఇప్ప‌టికే వారికి చేరింద‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

టిడీపీలో సిట్టింగులుగా ఉన్న‌వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ రానిప‌క్షంలో త‌మ దారి తాము చూసుకునేందుకు ప‌క్కా ప్ర‌ణాలిక‌లు సిద్దం చేసుకుంటున్నారు. చింత‌ల‌పూడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి పీత‌ల సుజాత కూడా కొత్త పొలిటిక‌ల్ దారులు వెతుక్కునే ప‌నిలో బిజీగా ఉన్న‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలోను, జిల్లాలోను గుస‌గుస‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

మూడేళ్ల మంత్రిగా ఆమెపై లెక్క‌లేన‌న్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. తీవ్ర విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పీత‌ల‌కు టీడీపీ టిక్కెట్ రాద‌న్న విష‌యం దాదాపు ఖ‌రారైపోయింది. కొత్త వ్య‌క్తికి సీటు ఇచ్చేందుకు చంద్ర‌బాబు స‌మాలోచ‌న‌లు కూడా చేస్తున్నారు.

ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వి పోగొట్టుకున్న సుజాత వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ రాక‌పోతే పార్టీ మారిపోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందుకే ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రంగా కాకుండా గ్రూపును మెయింటైన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఆమె కొంద‌రు వైసీపీ నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉన్నార‌ట‌. ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వి కోల్పోయిన గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు కూడా త‌న‌కు టిక్కెట్ రాద‌ని డిసైడ్ అయిన ప్ర‌కాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వైవి.సుబ్బారెడ్డితో ట‌చ్‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ టిక్కెట్ రాద‌ని డిసైడ్ అయిన పీత‌ల‌ వైసీపీ త‌ర‌పున‌ చింత‌ల‌పూడి నుంచి పోటీ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది

ఇప్ప‌టికె చింత‌ల‌పూడి వైసీపీ టిక్కెట్ రేసులో దెయ్యాల న‌వీన్‌బాబు, ప్ర‌భుత్వ అధికారి జ‌య‌రాజు, మాజీ మ‌ద్దాల రాజేష్ కూడా ఎవ‌రి పంతాలో వారు ట్రై చేసుకుంటున్నారు. మ‌రి సుజాత వైసీపీలోకి జంప్ చేస్తే అప్పుడు టిక్కెట్ కోసం నాలుగు స్తంభాలాట స్టార్ట్ అవుతుంది. వైసీపీ నుంచి టికెట్ క‌న్ఫ‌మ్ చేసుకున్న త‌ర్వాత‌నె పార్టీ మారాల‌ని చూస్తోంది. మ‌రి జ‌గ‌న్ హామి ఇస్తారా అన్న‌ది వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -