Saturday, May 18, 2024
- Advertisement -

చీరాలలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమేనా!

- Advertisement -

బాపట్ల జిల్లా చీరాల రాజకీయాలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. పర్యాటక,వస్త్ర వ్యాపారానికి పేరుగాంచిన చీరాల రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకమే. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ నాలుగు సార్లు ఈ స్థానాన్ని దక్కించుకోగా కాంగ్రెస్ మూడు సార్లు విజయం సాధించింది. ఇక గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేయగా టీడీపీ తరపున కరణం బలరాం విజయం సాధించారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కరణం బలరాం వైసీపీలో చేరారు.

ఈసారి పోటీకి దూరంగా ఉండనున్నారు బలరం. ఆయన స్థానంలో కరణం వెంకటేష్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. బలరాం వర్గానికి మంచి పట్టు ఉన్న నేపథ్యంలో ఇక్కడ వైసీపీ తొలిసారి జెండా ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక టీడీపీ పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. చీరాల నుండి జనసేన అభ్యర్థిగా ఆమంచి స్వాములుకు టికెట్ దాదాపు ఖాయమని తెలుస్తోంది. మాస్ నేతగా గుర్తింపు పొందిన స్వాములు ఈసారి కరణం వెంకటేష్‌కు గట్టి పోటీ ఇస్తారని తెలుస్తోంది. అయితే టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు కూడా తనకే మద్దతిస్తారని ధీమాతో ఉన్నారు బలరాం. మొత్తంగా ఈసారి చీరాల పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -