Friday, May 17, 2024
- Advertisement -

లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు..ఇక అరెస్టే!

- Advertisement -

టీడీపీ నేత నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు ఏపీ సీఐడీ అధికారులు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో అక్టోబర్ 4వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులు అందించారు. ఇక ఈ కేసులో నారా లోకేష్ ఏ14గా ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో నారా లోకేష్ ను కలిసిన సీఐడీ 41 ఏ కింద నోటీసులు ఇచ్చారు.

అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10గంటలకు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. విచారణకు వస్తానని లోకేష్ చెప్పినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారని సీఐడీ అధికారులను లోకేష్ అడగగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అని తెలిపారు సీఐడీ అధికారులు.

ఇక టీడీపీ హయాంలో జరిగిన అవినీతి కేసుల్లో ఇప్పుడు లోకేష్ వంతు వచ్చేసింది. విచారణ అనంతరం లోకేష్‌ని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉండగా టీడీపీ శ్రేణులకు మాత్రం నిరాశ కలిగించే అంశమే. ఇక తన అరెస్ట్‌ను ముందే ఊహించిన లోకేష్ తిరిగి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధం కాగా టీడీపీ సీనియర్ నేతల సూచనతో దానిని వాయిదా వేశారు. అయితే లోకేష్ అరెస్ట్ తర్వాత ఆయన సతీమణి బ్రాహ్మణీ పాదయాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -