Sunday, June 2, 2024
- Advertisement -

ఓ వైపు సీఎం కేసీఆర్ ప్రచారం..మరోవైపు నేతల రాజీనామా!

- Advertisement -

తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల రణరంగంలో బీఆర్ఎస్ ముందంజలో ఉండగా కారు టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. ఇక ఎన్నికల క్షేత్రంలో స్వయంగా రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్…ప్రతి రోజు రెండు నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా మరోవైపు టికెట్లు దక్కని నేతలు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడగా తాజాగా పలువురు నేతలు కారు దిగారు. రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సోమవారం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదని, స్థానిక సంస్థల హక్కైన స్వయంపాలన లేకుండా చేశారని, ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బానిసలుగా చేశారని వెల్లడించారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ టికెట్ ఆశీంచిన ఆమెకు నిరాశే ఎదురుకావడంతో బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పారు.

ఇక పఠాన్‌చెరు టికెట్ ఆశీంచి భంగపడ్డ ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ తో తన బంధం ముగిసిందని వెల్లడించిన ఆయన పాదయాత్ర ప్రారంభించారు. వీరి బాటలోనే మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్, ఆయన సతీమణి, హఫీజ్ పేట్ కార్పొరేటర్ పూజిత గౌడ్ లు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ధర్మపురిలో సైతం బీఆర్ఎస్ సీనియర్ నేత రాజీనామా చేశారు. మొత్తంగా ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -