Friday, May 3, 2024
- Advertisement -

అద్దంకి, నీలం మధుకు షాకిచ్చిన కాంగ్రెస్

- Advertisement -

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ నామినేషన్లకు చివరి రోజు కాగా ఎట్టకేలకు పైనల్ లిస్ట్‌ని రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పొత్తులో భాగంగా 118 స్థానాలకు అభ్యర్థులను ప్రటించగా ఒక స్థానాన్ని కొత్తగూడెంను సీపీఐకి కేటాయించింది. ఇక చివరి లిస్ట్‌లో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఒక అభ్యర్థిని మార్చింది.

పటాన్ చెరు టికెట్ ను గతంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధుకు కేటాయించగా తాజాగా ఆయన స్థానంలో ఆ టికెట్ ను కాట శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. సూర్యాపేట టికెట్ రాంరెడ్డి దామోదర్ రెడ్డే దక్కించుకున్నారు. మిర్యాల గూడ నుండి బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి స్థానాన్ని బీఆర్ఎస్ నుండి వచ్చిన మందుల శామ్యూల్‌కు, చార్మినార్ టికెట్‌ను మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్‌కు ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులుగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి నామినేషన్లు దాఖలు చేయగా వారు ఆర్వోకు ఇవాళ కాంగ్రెస్ బీ ఫామ్‌ను అందజేయనున్నారు. యడం విశేషం. రేపు సంబంధిత ఆర్వోకు వారిద్దరూ పార్టీ బీ ఫార్మ్ ను అందజేయనున్నారు.

పటాన్‌చెరు అభ్యర్థిని తొలగించడం చర్చనీయాంశం కాగా కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, పటేల్ రమేశ్ రెడ్డికి టికెట్ రాకపోవడం వారి పరిస్థితి ఏంటా అన్నది అర్ధం కావడం లేదు. ప్రధానంగా అద్దంకి దయాకర్‌కు టికెట్ రాకపోవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. పటాన్ చెరు టికెట్ విషయంలో దామోదర రాజనర్సింహ తన పట్టు నెగ్గించుకున్నారు. ఇక నీలం మధు ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటారా లేదా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -