Sunday, May 19, 2024
- Advertisement -

రేవంత్‌కు కొత్త తలనొప్పి..!

- Advertisement -

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి తయారైంది. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారింది. 17 ఎంపీ స్థానాలకు పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో ఎక్కువ శాతం మంత్రులు, సీనియర్ నేతల తనయులు ఉన్నారు. కొన్నిస్థానాల్లో పోటీ ఎక్కువగా ఉండటంతో ఫైనల్‌గా సీటు ఎవరికి దక్కుతుందోనని కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ప్రధానంగా ఖమ్మం ఎంపీ సీటు కోసం పోటీ ఎక్కువగా ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేసుకోగా సీటు తనకే ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అలాగే మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, రేణుకా చౌదరి, వీహెచ్‌ ఇలా చాలా మంది సీనియర్లు సీటు ఆశీస్తున్నారు.

ఇక నల్గొండ ఎంపీ స్థానానికి జానారెడ్డి కుమారుడు రణవీర్ రెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లేదంటే తమ కుటుంబం నుంచే మరోనేతను దింపుతామని బహిరంగంగానే చెబుతున్నారు. మల్కాజ్‌గిరి టిక్కెట్ కోసం మైనంపల్లి దరఖాస్తు చేసుకోగా నాగర్ కర్నూలు ఎంపీ టిక్కెట్ కోసం మల్లు రవి దరఖాస్తు చేసుకున్నారు. మల్లు రవి తమ్ముడే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి దామోదర రాజనర్సింహ కూతురు త్రిష మెదక్ టికెట్ ఆశిస్తుండగా,జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. పదేపదే కేసీఆర్‌ని కుటుంబ పాలన అని విమర్శించే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే బాట పడుతుండటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -