Sunday, May 5, 2024
- Advertisement -

పవన్ – నాగబాబు పరిస్థితి ఏంటీ?

- Advertisement -

ఏపీలో టీడీపీ – జనసేన పొత్తు ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు సీట్ల పంపిణీ గురించిన హడావిడి నడుస్తోంది. జనసేనకు టీడీపీ ఎన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాలను కేటాయిస్తుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే టీడీపీతో పొత్తు నేపథ్యంలో జనసేన కీలక నేతలతో సమావేశం నిర్వహించారు పవన్. టీడీపీతో పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అడగాలి? ఎక్కడ నుంచి ఎవరు పోటీ చేయాలి? అన్న దానిపై చర్చించారు.

టీడీపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జనసేనకు 20 అసెంబ్లీ, 2 ఎంపీ స్ధానాలను కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ 20 స్ధానాలు ఏంటీ అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. జనసేన నుండి పోటీ చేసేందుకు ఆశావాహులు పెద్ద ఎత్తున ఉండగా టీడీపీ కేటాయించే స్ధానాలు తక్కువగా ఉండటంతో పవన్‌కు ఇప్పుడు కొత్త చిక్కులు మొదలైనట్లు తెలుస్తోంది.

దీంతో పాటు అసలు తాను ఎక్కడి నుండి పోటీచేయాలనే మీమాంసలో ఉన్నారు పవన్. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తన సొంత నియోజకవర్గం తెనాలి నుండి బరిలోకి దిగేందుకు రెడీ అవతున్నారు. నాదెండ్ల ఒక్కడి సీటు తప్ప మిగితా నేతెలవరికి ఏ సీటు నుండి పోటీచేయాలనే దానిపై స్పష్టత లేదు. ఇక పవన్ గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఈ సారి కూడా ఆ రెండు స్ధానాల్లో ఏదో ఒక చోటు నుండి పోటీ చేస్తారా లేదా రెండు చోట్లా పోటీ చేస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. ఒకవేళ నియోజకవర్గం మారితే ఎక్కడి నుండి పోటీచేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు పవన్.

ఇక జనసేన మరో కీలక మెగాబ్రదర్ నాగబాబుది ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు నాగబాబు. మళ్లీ ఆయన లోక్‌సభకే పోటీ చేస్తారా? లేక అసెంబ్లీని ఎంచుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. ముందస్తు ఎన్నికలు అని ప్రచారం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -