Sunday, May 19, 2024
- Advertisement -

ప్రజాదర్బార్..వడ్డీ లేని రుణాలు..కాంగ్రెస్ మేనిఫెస్టో

- Advertisement -

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. హైదరాబాద్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోకు అభయ హస్తం అనే పేరును ఖరారు చేయగా 42 పేజీలతో 62 ప్రధాన హామీలతో పలు ప్రజాకర్షక పథకాలను పొందుపరిచారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లింది. మహాలక్ష్మి స్కీమ్, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పేరుతో ఆరు గ్యారంటీలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

నియోజకవర్గాలతో పాటు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పొందు పర్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో భగవద్గిత,బైబిల్,ఖురాన్ లాంటిదని ఆ పార్టీ నేతలు తెలిపారు. వచ్చేది కాంగ్రెస్ సర్కారేనని ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. కొత్తగా ట్రిపుల్ ఐటీల ఏర్పాటు,రైతులకు ఫ్రీ కరెంట్, కాళేశ్వరం ముంపు బాధితులకు సాయం,విపత్తు నష్టాలకు ఇన్ పుట్ సబ్సిడీ, ప్రజాభిప్రాయంతో ఫార్మాసిటీల రద్దు, కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. మెగా డీఎస్సీ,2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తి చేస్తామని ప్రకటించారు.ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -