Sunday, May 19, 2024
- Advertisement -

కాంగ్రెస్‌ దూకుడు..ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్!

- Advertisement -

మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పదేళ్ల తర్వాత అధికారంలోకి రాగా ఎంపీ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది కాంగ్రెస్. ఇక ఇప్పటికే ఎంపీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించగా అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు.

ఇప్పటికే ఆయా లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్లను పీసీసీకి డీసీసీ అధ్యక్షులు పంగా ఈ జాబితాను పీఈసీ పరిశీలించనుంది. ఒక్కో స్థానానికి ముగ్గురు పేర్లను సూచించగా వీరిలో ఒకరిని ఫైనల్ చేయనున్నారు ఖర్గే.

నియోజకవర్గాల వారీగా ఆశావాహుల జాబితాను పరిశీలిస్తే… మహబూబాబాద్ (ఎస్టీ) – బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, కాశీరాం నాయక్, ఖమ్మం (జనరల్) – సోనియా గాంధీ, రేణుకా చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, వీహెచ్,హైదరాబాద్ (జనరల్) – ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, కరీంనగర్ (జనరల్) ప్రవీణ్ రెడ్డి, రుద్ర సంతోష్ కుమార్, నేరెళ్ల శారద, రోహిత్ రావు పేర్లు పరిశీలిస్తున్నారు.

ఇక పెద్దపల్లి (ఎస్సీ) – గడ్డం వంశీ, నల్లాల ఓదెలు, నిజామాబాద్ (జనరల్ ) – ఈరవత్రి అనిల్, జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, దిల్ రాజు, మెదక్ (జనరల్) – జగ్గారెడ్డి, త్రిష (దామోదర రాజనర్సింహ కూతురు), జయారెడ్డి(జగ్గారెడ్డి కూతురు), జహీరాబాద్ (జనరల్ ) – సురేశ్ షెట్కార్, మల్కాజ్ గిరి (జనరల్) – మైనంపల్లి హన్మంతరావు, హరివర్ధన్ రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డి, సికింద్రాబాద్ (జనరల్) – అనిల్ కుమార్ యాదవ్, వేణుగోపాల్ స్వామి, రోహిన్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు.

చేవేళ్ల (జనరల్) -చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, కేఎల్ఆర్, మహబూబ్ నగర్ (జనరల్) – జీవన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, జిల్లెల ఆదిత్య రెడ్డి, సీతాదయాకర్ రెడ్డి, నల్గొండ (జనరల్) – జానారెడ్డి, రఘువీర్ రెడ్డి(జానారెడ్డి కొడుకు), పటేల్ రమేశ్ రెడ్డి, భువనగిరి (జనరల్) – చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్నా కైలాశ్ నేత, శివసేనా రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, వరంగల్ (ఎస్సీ) – అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, సర్వే సత్యనారాయణ, నాగర్ కర్నూల్ (ఎస్సీ) – సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేశ్, ఆదిలాబాద్ (ఎస్టీ) – నరేశ్ జాదవ్, సేవాలాల్ రాథోడ్ పేర్లు పరిశీలిస్తున్నారు. వీరిలో ఒకరి పేర్లను ఫైనల్ చేయనుండగా త్వరలోనే వీరు ప్రజాక్షేత్రంలో రంగంలోకి దిగనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -