- Advertisement -

జగన్‌తో వంశీ భేటీ..

- Advertisement -

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. జైలు నుండి విడుదలైన అనంతరం తాడేపల్లి నివాసంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైయస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వల్లభనేని వంశీని టార్గెట్ చేసింది. ఏకంగా 11 అక్రమ కేసులు నమోదు చేసింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా దీనిపై సుప్రీంను ఆశ్రయించింది కూటమి ప్రభుత్వం. అయితే అక్కడ చంద్రబాబు సర్కార్‌కు నిరాశే ఎదురుకాగా విజయవాడ సబ్‌ జైల్‌ నుంచి ఈ నెల 2వ తేదీ వంశీ విడుదలయ్యారు.

ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ప‌లువురు ఆయ‌న ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌, త‌దిత‌రులు ప‌రామ‌ర్శించి, ధైర్యం చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -