తెలంగాణ పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొరడా విధించింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్ అయింది. దళిత యువకుడు కార్లే రాజేష్ కస్టడీ మరణం కేసులో మూడు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
తెలంగాణ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని ఫిర్యాదుతో రంగంలోకి దిగింది ఎన్‌హెచ్‌ఆర్‌సీ. ఐదు రోజుల అక్రమ నిర్బంధం, థర్డ్ డిగ్రీ చిత్రహింసలు, చివరికి మృతిచెందారు రాజేష్.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు విషయంలో ఫిర్యాదు చేసినందుకు అమాయకుడైన కర్ల రాజేష్ అనే యువకుడిని జైల్లో చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేయగా పోలీసుల పాత్రపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ,తల్లి ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదా? హత్య కేసు, ఎస్సీ,ఎస్టీ చట్టం కింద చర్యలు కోరింది బాధిత కుటుంబం.
పోస్ట్‌మార్టం వీడియో నుంచి మేజిస్ట్రియల్ విచారణ వరకు అన్ని రికార్డులు సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించగా సూర్యాపేట ఎస్పీ, జిల్లా కలెక్టర్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. నిజానిజాలు తేల్చేందుకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రత్యేక విచారణ చేపట్టారు.


