అత్యాశ ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా జన్వాడలో బాలసాయి, పద్మ ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో నిధి ఉందని రూ.10 లక్షలు తీసుకున్నారు అత్తమామలు. వారి అత్యాశకు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట బలికాగా 5 నెలల బాలుడు అనాథగా మిగిలాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకు అత్తగారి ఇంటికి వెళ్ళిన బలసాయికి తమ ఇంట్లో నిధి ఉందని ఓ సాధువు చెప్పాడని, అది తీయడానికి రూ.10 లక్షలు కావాలని నమ్మించారు అత్తమామలు, తోడల్లుడు.
దీంతో 4 నెలల క్రితం వడ్డీలకు రూ.10 లక్షలు అప్పు తెచ్చి ఇచ్చాడు బలసాయి. తవ్వకాలు జరపగా నిధి దొరకకపోవడంతో అత్తమామలు, తోడల్లుడు చేతులెత్తేశారు. అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచని స్థితిలో బాలసాయి, పద్మ బలవన్మరణం చెందగా వారి 5 నెలల బాబు అనాథగా మారాడుఉ.
బలసాయి ఫోన్లో అందరూ క్షమించాలి.. నేను, నా భార్య మా అత్తమామల మాటలు నమ్మి మోసపోయాం. …మా చావుకు వారే కారణం అనే మెసేజ్ చూసి అత్తమామలు శాంతమ్మ, చంద్రయ్య, తోడల్లుడు వెంకటేష్ లను అరెస్ట్ చేశారు పోలీసులు.
