- Advertisement -

జగన్ నిలదీతతో దిగొచ్చిన సర్కార్!

- Advertisement -

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఎట్టకేలకు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మొదటి నుండి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన తీవ్ర విమర్శలు, నిలదీతల తర్వాతే ఈ అరెస్ట్ జరగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ కేసులో నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారంటూ అంతకుముందు జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధితుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన తర్వాతే అతను మాయమయ్యాడని, స్టేషన్‌లోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను కూడా ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారని ఆయన ఆరోపించారు. ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, దోషులైన పోలీసు అధికారులను అరెస్ట్ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ జగన్ చేసిన ఈ పదునైన విమర్శలతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.

వైసీసీ చీఫ్ వైఎస్ జగన్ ఒత్తిడి మరియు ప్రజా సంఘాల ఆందోళనల నేపథ్యంలో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. ప్రాథమిక దర్యాప్తులో కృష్ణలంక సీఐ నాగరాజు బాధ్యతారాహిత్యం, నిజాలు దాచే ప్రయత్నం చేసినట్లు బలమైన ఆధారాలు లభించడంతో ఆయనను అధికారికంగా అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -