Friday, May 17, 2024
- Advertisement -

భార‌త ఐటీ నిపుణుల‌కు ర‌ష్యాబంప‌ర్ ఆఫ‌ర్‌

- Advertisement -
h 1b visa restrictions russia opens its doors for indian it pros

అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన త‌ర్వాత భార‌త ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌తోపాటు … నిపునులుకు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదురౌతున్నాయి. అమెరికా ఉద్యోగాల‌ను ఇత‌ర దేశాలు కొల్ల‌గొడుతున్నాయంటూ …ఇక్క‌డి ఉద్యోగాలు స్థానికుల‌కే నీ హెచ్ 1 వీసా నిబంధ‌న‌ల‌ను ఖ‌టిన‌తరం చేశారు. దీంతో భార‌త ఐటీ ప‌రిశ్ర‌మ పెద్ద ముప్పును ఎద‌ర్కోంటోంది. దేశంలో అక్ర‌మంగా ఉన్న వారంద‌న‌రినీ వారి దేశాల‌కు వెల్లిపోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.అమెరికా బాట‌లో కొన్ని దేశాలుకూడా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంతో ఇప్ప‌డు ఐటీ నిపునుల‌కు క‌ష్టంగా మారిని నేప‌థ్యంలో ర‌ష్యా మాత్రం భార‌త ఐటీ నిపునుల‌కు,ఐటీ కంపెనీల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరమవుతుండటంతో, భారత ఐటీ ఇండస్ట్రీకి రష్యా తలుపులు బార్ల తెరిచే ఉంచుతుందని ఆ దేశ మంత్రి చెప్పారు. గతవారంలో పర్యటనకు వచ్చిన రష్యన్ మంత్రి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రంగాల్లో రెండింట్లో ఇరుదేశాల మధ్య సహకారం కోసం చూస్తున్నామని తెలిపారు. కేవలం సహకార చర్చలు మాత్రమే కాక, దేశీయ ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ తో కూడా రష్యన్ టెలికాం, మాస్ కమ్యూనికేషన్ డిప్యూటీ మంత్రి రషిద్ ఇష్మైలవ్ చర్చలు జరిపారు. రాడికల్ గ్రూప్ లపై పోరాటానికి సైబర్ సెక్యురిటీలో, ఇతర భద్రతా ముప్పుల్లో ఇరు దేశాల మధ్య సహకారం అవసరమని మంత్రి, దేశీయ అధికారులతో చర్చించారు.

దీంతో అమెరికాలో వీసా నిబంధనలతో దెబ్బతింటున్న దేశీయ ఐటీ ఇండస్ట్రీకి రష్యా స‌పోర్టుగా నిలుస్తోంది. అటు అమెరికాతో పాటు పలు దేశాలు తీసుకొస్తున్న వీసా నిబంధనల కఠితనతరంతో భారత టెక్కీలకు కొన్ని దేశాలు ఆహ్వానాలు పలుకుతున్నాయి. తమ దేశంలో టెక్నాలజీ సేవలు అందించేందుకు రావాలంటూ కెనడా లాంటి దేశాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రష్యా సైతం భారత ఐటీకి బార్ల తలుపులు తెరచి ఉంచనున్నట్టు తెలుపుతోంది.

జూన్ 1 నుంచి 3వ తేదీల్లో రష్యాలో సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించబోతున్నారు. దీనిలో భారత్ గెస్ట్ కంట్రీ ఉండ‌బోతోంది. ఐటీ రంగాల్లో ఇండో-రష్యన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ వేదిక ఎంతో సహకరించనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోరమ్ లో ప్రధాని మోదీతో పాటు నాస్కామ్ కు చెందిన కొందరు అధికారులు కూడా పాలుపంచుకోనున్నారు. భారత్ వరల్డ్ క్లాస్ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో దూసుకెళ్తుండగా.. రష్యా కంప్యూటర్ ప్రొగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లో ఎక్కుగా పురోగతి సాధిస్తోంది. ఇక భార‌త ఐటీప‌రిశ్ర‌మ‌లు,ఐటీ నిపునుల‌కు మంచిరోజుల‌న్న‌మాట‌.

Related

  1. బాబుని మరోసారి అడ్డంగా బుక్ చేసిన లోకేష్
  2. ఉప ఎన్నికలకు ముందే.. అఖిల ప్రియకు చుక్కలు చూపిస్తున్నారు
  3. ఏపీ రాజకీయాలో మరో సంచలనం.. వైసీపీలోకి కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత
  4. కృష్ణ జిల్లాలో సంచలనం.. వైసీపీలోకి ముగ్గురు కీలక నాయకులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -