Thursday, April 25, 2024
- Advertisement -

అల్లు అర్జున్ ‘పుష్ప’ లో విలన్ గా తమిళ నటుడు..!

- Advertisement -

అల్లు అర్జున్ సుకుమార్ కాంబో వస్తున్న పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి.. అయితే రంగస్థలం లాంటి హిట్ కొట్టినా సుకుమార్ కి ఏదీ కలిసి రావట్లేదు అని చెప్పాలి… అన్ని బాగుంటే ఇప్పటికే మహేష్ బాబు తో సినిమా చేసి రిలీజ్ చేయాల్సి ఉండేది. కానీ విధి ఆడిన నాటకంలో మహేష్ సుకుమార్ కి హ్యాండ్ ఇవ్వడం సుకుమార్ తనకు అచ్చోచ్చిన హీరో అయిన అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేయడం తేలిసిందే.

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ 10నుండీ ప్రారంభమయ్యింది. నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగునుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు.

అయితే మొదటినుంచి అనుకున్నట్లు సినిమా విలన్ పై రోజు కో పేరు వినిపిస్తుంది.. మొదట్లో ఈ సినిమా కి తమిళ నటుడు విజయ్ సేతుపతి ని విలన్ గా ఫిక్స్ చేయగా డేట్ సమస్య వల్ల ఆయన ఈ సినిమా కి దూరమయ్యారు.. తర్వతా ఒకరిద్దరు తమిళ, హిందీ నటుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కాని తాజాగా ఇప్పుడు గతంలో అల్లు అర్జున్ వరుడు సినిమాలో విలన్ గా నటించిన తమిళ నటుడు ఆర్య పేరు పుష్ప సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై సినిమా యూనిట్ నుంచి క్లారీటి రావాసిఉంది.

అప్పుడు త్రివిక్రమ్, ఇప్పుడు సుకుమార్.. పుష్ప సినిమా కాపీనా..!!

’ఫైటర్’ ఇంకా రెడీ అవ్వలేదా..?

టాలీవుడ్ యంగ్ హీరోల చూపు త్రివిక్రమ్ వైపు…?

స్టార్ డైరెక్టర్ కు నో చెప్పిన సాయిపల్లవి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -