Wednesday, May 7, 2025
- Advertisement -

గాలి కూతురి పెళ్లి కోసం ఎంత ఇస్తున్నారో తెలుసా..?

- Advertisement -
gali janardhan reddy daughter marriage dowry shocking

గాలి జనార్ధన రెడ్డి తన కూతురి పెళ్లి కోసం బెయిలుపై బయటకి వచ్చారు. వచ్చిన వెంటనే తన మార్క్ దేశం మొత్తం వినిపించేలా చేసాడు. హైదరాబాదుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు రాజీవ్ రెడ్డికి తన కూతురు బ్రాహ్మణి రెడ్డిని ఇచ్చి ఈ నెల 16 వ తేదీన వివాహం చేస్తున్నారు.

తన కూతురి పెళ్ళికి సుమారుగా రూ.500 కోట్లు ఖర్చు పెడుతున్న గాలి అందరిచే ఔరా అనిపిస్తున్నారు. ఆహ్వాన పత్రికలలో వీడియో ఏర్పాటు చేసి అందరి దృష్టిని తన వైపు ఆకర్షించారు. సెలెబ్రెటీలు తన కూతురి పెళ్లికి వస్తే కోటి ఇస్తా అని చెప్పి అందరిచే వామ్మో అనిలా చేసాడు. అయితే ఇప్పుడు గాలి తన కూతురి పెళ్లి కోసం ఎంత కట్నం ఇస్తున్నారో తెలుసా? రూ.9 వేల కోట్లు అండి. అవును మీరు విన్నది నిజమే అక్షరాలా తొమ్మిది వేలకోట్లు. ఈ కట్నం ద్వారా ఒక చిన్నపాటి నీటి పారుదల ప్రాజెక్ట్ కట్టొచ్చు.

ప్రస్తుతం నోట్ల రద్దు కారణంగా గాలి అంత డబ్బు ఇవ్వలేకపోతున్నారంట. నోట్ల రద్దు ప్రభావం గాలి కూతురి పెళ్లి మీద కూడా పడిందట. ఇప్పటికే కట్నం కింద రూ.7 వేల కోట్లు ఇచ్చిన గాలి మిగతా డబ్బుని బంగారం రూపంలో సమర్పించనున్నారంట. తన కూతురి పెళ్ళిలో డబ్బు వొద్దన్న పనోళ్ళకి బంగారం ఇచ్చిన గాలి, ఇప్పుడు కట్నం కింద సుమారు రెండు టన్నున్నర విలువచేసే బంగారాన్ని కానుకగా ఇస్తున్నారు. ఐతే అప్పట్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికీ రూ.45 కోట్లు విలువచేసే బంగారు కిరీటాన్ని ఇచ్చిన గాలి, సిబిఐ సోదాల్లో ఇంట్లోనే సుమారుగా 250 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాంటి గాలికి ఇప్పుడు ఈ బంగారం ఒక లెక్క అనిపిస్తుంది కదూ ఎంతైనా గాలి గారు గాలే.

{youtube}w6sMamSFigw{/youtube}

Related

  1. నిద్ర‌కు – సెక్స్‌కు షాకింగ్ చేసే లింక్ ఉంది!
  2. టాలీవుడ్ హీరోలకు షాక్ ఇచ్చిన మోడీ!
  3. ఎన్టీఆర్ ఆస్తి ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే!
  4. షాకింగ్ న్యూస్ చెప్పిన సూపర్ స్టార్ రజనీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -