Friday, May 24, 2024
- Advertisement -

జడ్జికి 40 కోట్ల లంచం.. ‘గాలి’నా మజాకా?

- Advertisement -

కర్ణాటక బళ్లారి కేంద్రంగా మైనింగ్ ను విస్తరించి కోట్లకు పడగలెత్తిన గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ సంపాదన గురించి ఎన్నో సార్లు చదివాం.. కానీ ఇంత భారీ స్థాయిలో గాలి వెనుకేసాడా అన్న విషయం ఇప్పుడు ఒక్క సంఘటనతో నిరూపితమైంది.

తాజాగా ఓబుళాపురం మైనింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో గడిపి బెయిల్ పై విడుదలై విచారణను ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పట్లో 2012లో గాలి జనార్ధన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు. ఆ సమయంలో హైదరాబాద్ ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది.

ఈ సందర్భంగా గాలికి బెయిల్ కోసం జడ్జీలకు 100 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పోలీసులు విచారించగా నిజమేనని తేలింది.

ఈ లంచానికి సంబంధించిన ఆఫర్ ను తాజాగా జడ్జి నాగమారుతి శర్మ వాంగ్మూలంతో మరోసారి బట్టబయలు అయ్యింది. 2012లో గాలి జనర్ధాన్ రెడ్డి తనకు బెయిల్ ఇవ్వడానికి ఏకంగా ఏసీబీ జడ్జి నాగమారుతి శర్మకు రూ.40 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని.. మరో న్యాయమూర్తికి 15 కోట్లు ఆశచూపారని కేసు నమోదైంది. గాలి తనకు మొత్తం 100 కోట్ల ఆఫర్ చేసి మొదటి విడతగా 40 కోట్లు లంచం ఇస్తానన్నారని జడ్జి నాగమారుతి శర్మ సోమవారం వాంగ్మూలం ఇచ్చారు. అయితే గాలి 40 కోట్ల బెయిల్ ఆఫర్ ను నాగమారుతి శర్మ నిరాకరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. తాజాగా ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి జడ్జి నాగమారుతి శర్మ హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు రావడంతో ఇది సంచలనంగా మారింది..

40 కోట్ల లంచాన్ని ఇవ్వజూపినినట్టు నాగమారుతి శర్మ చెప్పిన వాంగ్మూలాన్ని రికార్డు చేసిన ఏసీబీ జడ్జి తాజాగా విచారణను సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -