Sunday, May 5, 2024
- Advertisement -

గాలిజనార్థనరెడ్డి జైలుకు వెళ్ళడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి, సోనియా

- Advertisement -

జనాలను మోసం చేయాలంటే ఎల్లో మీడియా తర్వాతే ఎవరైనా? 1994 ఎన్నికలకు ముందే, అధికారంలో లేనప్పుడే లక్ష్మీపార్వతిని పెళ్ళి చేసుకున్నాడు ఎన్టీఆర్. అధికారంలో లేనప్పుడు ఎన్టీఆర్‌కి అండగా నిలిచింది లక్ష్మీపార్వతినే. ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి వివాహాన్ని తెలుగు ఓటర్లు అంగీకరించే ఆయనకు అధికారం కట్టబెట్టారు. ముసలివాడినయ్యాను……చూసుకోవడానికి మనిషి కోసం పెళ్ళి చేసుకున్నాను అని ఎన్టీఆర్ చెబితే తెలుగు ప్రజలందరూ సానుభూతితో అర్థం చేసుకున్నారు. కానీ అధికార దాహంతో రగిలిపోయినవాళ్ళు మాత్రం కళ్ళు మూసుకుపోయి అందులో కామాన్ని చూశారు. ఎన్టీఆర్ బహిరంగ శృంగారం అనేస్థాయిలో రాజగురువు నంబర్ ఒన్ పత్రిక సిగ్గులేకుండా వార్తలు రాసింది. జర్నలిజాన్ని పాతాళానికి దిగజార్చింది. ఎన్నో నీచమైన పనులకు పాల్పడి ఎన్టీఆర్ అధికారాన్ని, ఆయన పార్టీని లాక్కున్నారు. అంతటితో ఆగారా? లేదు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఇంకా దారుణానికి ఒడిగట్టారు. అదే ఎన్టీఆర్ పార్టీని ఉద్ధరించడానికే ఎన్టీఆర్‌ని పదవి నుంచి దించి, అధికారాన్ని తీసుకున్నామని నమ్మించారు. ఇక టిడిపిని దిగ్విజయంగా నడిపించడం బాబుకే సాధ్యమైందని, అందుకని ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడున్నా సంతోషిస్తూ ఉంటుందన్న కలర్ ఇచ్చారు. అసలు నిజాలు తెలిసినవాళ్ళందరూ కూడా ఈ రోజుకీ కూడా………‘దేవుడా…….ఎల్లో బ్యాచ్ మాయలు ప్రపంచంలోనే ఇంకెవరైనా చేయగలరా? గ్రాఫిక్స్ సినిమాల్లో కూడా సాధ్యం కావేమో కదా’ అని ఆశ్ఛర్యపోతూ ఉంటారు. ఇంకా ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళు సమాజానికి నీతులు చెప్తూ ఉండడం…….ఇంతకంటే వింతలు ఇంకే ఉంటాయి.

వైఎస్ రాజశేఖరరెడ్డిని గాలి జనార్థనరెడ్డికి ఆత్మబంధువును చేసి పడేసింది ఎల్లోబ్యాచ్. ఒక ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా గాలి జనార్థనరెడ్డిని ప్రశంసిస్తూ వైఎస్ మాట్లాడిన మాటలు, ఆవేశపరుడైన గాలి జనార్థనరెడ్డి జగన్ గురించి మాట్లాడిన మాటలను పదేపదే చూపిస్తూ వైఎస్-గాలి ఫ్యామిలీలను ఆత్మబంధువులను చేసిపడేశారు. అంతా కూడా గాలి జనార్థన్‌రెడ్డి తప్పులు బయటపడ్డాక.

కానీ అంతకుముందు గాలి జనార్థన్‌రెడ్డికి మైనింగ్ లీజులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే అన్న విషయం ఎంతమందికి తెలుసు? అధికారిక పత్రాల్లోనే ఆ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక గాలి జనార్థన్‌రెడ్డి జైలుకు వెళ్ళడంలో కూడా వైఎస్సార్ పాత్ర ఉందని తెలుసా?

అప్పట్లో కర్ణాటకలో బిజెపి పార్టీకి గాలి జనార్థనరెడ్డి చాలా పెద్ద బలం. కనీసం 20మంది ఎమ్మెల్యేలను గెలిపించగల నాయకుడు. బిజెపి ముఖ్య నాయకురాలు, ఒకానొక సమయంలో ప్రధానమంత్రి అభ్యర్థి, గతంలో లోక్‌సభలో బిజెపి నేత, ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి అయిన సుష్మాస్వరాజ్ గాలి జనార్థనరెడ్డికి అన్ని విధాల అండగా నిలిచారు. అప్పట్లో కర్ణాటకలో గాలి వైభవం ఓ స్థాయిలో ఉండేది. అంతా కూడా చంద్రబాబు-వాజ్‌పేయి జమానాలోనే. కర్ణాటకలో ఎలా అయినా అధికారంలోకి రావాలనుకున్న సోనియా గాంధీ…..గాలి జనార్థన్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి రమ్మని కోరింది. కానీ గాలి ఒప్పుకోలేదు. ఆ తర్వాత గాలిని ఒప్పించమని వైఎస్సార్‌కి చెప్పింది. గాలి జనార్థనరెడ్డిని కలిసి వైఎస్సార్ విషయం చెప్పాడు. సోనియాతో వ్యవహరాం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. కానీ సుష్మాస్వరాజ్‌తో చాలా మంది పెద్దల అండ చూసుకున్న గాలి జనార్థనరెడ్డి లైట్ తీసుకున్నాడు. ఆ దెబ్బతో సోనియాకు కోపం వచ్చింది. ఢిల్లీ పెద్దలకు కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసుగా? వెంటనే సిబిఐ, ఈడీలు రంగంలోకి దిగిపోయాయి. ఇక్కడ గాలి తప్పు చేయలేదు అని ఎవరూ చెప్పడం లేదు. కానీ మద్ధతిస్తే 2జీ స్పెక్ట్రమ్ లాంటి కేసులో డిఎంకె నాయకులు నిర్దోషులు అవ్వడం, శతృవు అయిన లాలూకూ మాత్రం జైలు శిక్ష తప్పకపోవడం లాంటి పరిణామాలే వ్యవస్థలపై నమ్మకం పోయేలా చేస్తున్నాయి. ఇక గాలి జనార్థన్‌రెడ్డి-వైఎస్సార్-సోనియాల చర్చలు, గాలి తిరస్కరించడం, సోనియా కేసులు పెట్టించడం గురించి ఆంద్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కూడా తన కొత్త పలుకులో రాసుకొచ్చాడు. కాకపోతే గాలి-వైఎస్‌లు ఒక్కటే అని రాసిన వార్తలు మాత్రం టాప్ హెడ్‌లైన్స్‌లో పేపర్ మొత్తం రాస్తారు. ఇలాంటి వైఎస్‌లకు ప్లస్ అయ్యే వార్తలు మాత్రం పేర్లు కూడా ప్రస్తావించకుండా మేనేజ్ చేస్తూ రాస్తారు.

ఎల్లో బ్యాచ్ రాజకీయ కుట్రలు చూస్తే దిమ్మ తిరగడం లేదా? ఇప్పుడే ఏమైంది? 2019కి ఎలాంటి మేజిక్కులు చేస్తారో……ఈ మేజిక్కులకు పవర్ స్టార్ అద్భుత నటన ఎలా ఉంటుందో…….ఇంకా ఎన్ని సిత్రాలు సూడాలో……..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -