వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, వైసీపీ జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే అని రాయపాటి అన్నారు. జగన్ కడప స్టీల్ ఫ్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం దురదృష్టకరం అన్నారు రాయపాటి. ఇక కడప స్టీల్ ఫ్లాంట్‌లోకి జగన్ తన అన్నను రంగంలోకి దించాడని గాలి జనార్దన్ రెడ్డిను ఉద్దేశించి మాట్లాడారు.
కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్ధన్‌రెడ్డి అందించిన ఆర్థిక సాయానికి కడప స్టీల్‌ప్లాంట్‌ను బహుమానంగా ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. గాలి జనార్ధన్‌రెడ్డి ఈ వ్యవహారంలోకి ఎంటర్ అవ్వడంతో జగన్ సైలెంట్ అయ్యాడని రాయపాటి ఎద్దేవ చేశాడు. వచ్చే ఎలెక్షన్స్‌లో టీడీపీ గెలవడం ఖాయం అని రాయపాటి జోస్యం చెప్పారు.
