Friday, May 3, 2024
- Advertisement -

నాగార్జునకు ఓ పక్క హ్యాపి మరో పక్క బీపీ!

- Advertisement -

మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘నిర్మలా కాన్వెంట్‌’. ఈ చిత్రంతో శ్రీకాంత్ కొడుకు రోషన్‌ను హీరోగా పరిచయం కాబోతున్నాడు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. జి.నాగకోటేశ్వరరావు అనే న్యూ డైరెక్టర్ ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నాడు.

ఈ సినిమా బాద్యతలు అన్ని నాగర్జున తనపై వేసుకున్నాడు. సినిమాపై హైపు పెంచడం కోసం ఈ చిత్రంలో నాగర్జున ఓ ముఖ్యమైన పాత్ర కూడా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంకు సంబంధించి ఎడిటింగ్ సమయంలో నాగర్జున ఈ చిత్రం చూసి చాలా హ్యాపీ అయ్యాడట. రోషన్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడట. రోషన్ నటన నాగర్జునకు చాలా బాగా నచ్చిందట. రోషన్ ప్రతి సీన్లో చాలా కొత్తగా నటించాడట.

అయితే నాగార్జునకు ఓ పక్కన హ్యాపీగా ఉన్న మరో పక్కన భయంగా ఉందట. అక్కినేని అఖిల్ కి రోషన్‌ గట్టి పోటి ఇస్తాడేమో అని భయపడుతున్నాడట. అఖిల్ చేసిన మొదటి సినిమా ప్లాప్ అయిన విషయం తెలిసిందే. అందుకే అఖిల్ రెండో సినిమా విషయంలో నాగర్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ప్రస్తుతం అఖిల్ కి రోషన్ గట్టి పోటీ ఇస్తాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Related

  1. నాగార్జున కి బాహుబలి కావాలట
  2. నాగర్జున మీద కోపంగా ఉన్న సుశాంత్!
  3. నాగార్జున కి షాక్ ఇచ్చిన మేనల్లుడు సుశాంత్
  4. సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -