అప్పటివరకు ప్లాప్ లో ఉన్న నిఖిల్ ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాలతో వరస హిట్స్ కొట్టాడు. దానికి కారణం ఆ కథల్లో ఉన్న కొత్తదనమే. అలా కథల ఎంపిక విషయంలో నిఖిల్ చాలా దృష్టి పెట్టాడు. సరిగ్గా అప్పుడే ‘శంకరాభరణం’ మళ్లీ నిఖిల్ కి ప్లాప్ ఇచ్చింది.
ఈ ప్లాప్ వెనకల ఉన్న కారణంను ఇటివలే నిఖిల్ బయట పెట్టాడు. నిఖిల్ కి ఈ సినిమా చేయడం తొలి నుండీ ఇష్టం లేదట. అయితే కొన్ని ఒత్తిళ్ల వల్ల ఈ సినిమా చేయక తప్పింది కాదట. పరిశ్రమలో ఇదేమీ కొత్త కాదు నిర్మాత మూలంగానే దర్శకుడితో ఉన్న అనుబంధం వలనో కొన్నిసార్లు నచ్చకపోయినా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా వారి చేసిన చిత్రాల్లో సక్సెస్ నుంచి కాక ప్లాపల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటామని చెబుతుంటారు మన తారలు.
ఇదే సంగతిని తన అనుభవం దృష్ట్యా నిఖిల్ ‘ఒత్తిళ్ల వల్ల సినిమాలు చేయకూడదన్న విషయాన్ని శంకరాభరణంతో నేర్చుకున్నా’ అన్నాడు. నిఖిల్ పేరు చెప్పకపోయినా ఆ ఒత్తిడి కలిగించింది చిత్ర రచయిత, నిర్మాణ భాగస్వామి అయిన కోన వెంకట్ అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. పాపం నిఖిల్ ఇంతలా విసిగిపోయాడంటే కోన ఎంత హింసించుంటాడో..?
Related