మీటింగ్ ల నిమిత్తం డిల్లీ వెళ్లి అక్కడ హడావిడిగా గడిపిన కెసిఆర్ చాలా తీవ్రమైన అస్వస్థత కి గురయ్యారు. సమావేశం మధ్యలోనే బయటకి వచ్చేసి తన బసకి చేరుకున్న కెసిఆర్ తాను చెప్పదలచుకున్నవి అన్నీ లిఖిత పూర్వకంగా ఇచ్చి పంపించారు. . అయితే కేసీఆర్ జ్వరం విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ ఆయనను ఎలా ఉంది అని ప్రశ్నించడమే కాకుండా ఇంకొంత చొరవ తీసుకుని ఎయిమ్స్ వైద్యులను ఇంటికి పంపనా అని అడిగారట.
అయితే కేసీఆర్ ప్రధాని మోడీ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. తాను అల్లోపతి వైద్యం కన్నా దేశీయ వైద్యమైన ఆయుర్వేదాన్ని నమ్ముతానని ఆ మందులనే వినియోగిస్తానని చెప్పారట. అదేసమయంలో తన ఫ్యామిలీ ఆయుర్వేద వైద్యుడిని ఢిల్లీకి పిలిపించుకున్నట్టు కూడా ఆయన చెప్పారు.
దీంతో మోడీ ఒక్కసారిగా ఆశ్యర్యానికి గురయ్యారట. ఎందకంటే మోడీకి దేశీయ వైద్య విధానాలంటే అమితమైన మక్కువ. అంతేకాదు యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేందుకు ఎంతో కృషి చేశారు.
