Wednesday, May 15, 2024
- Advertisement -

ఇక నుంచి బూత్(పోర్న్ వెబ్‌సైట్స్) బంద్!

- Advertisement -

ఇండియా మొత్తం మీద బూతు సైట్లను నిషేదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొత్తం 857 పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. నేరుగా వెబ్‌సైట్ల మీద నిషేదం విదించకుండా టెలికమ్ ఆపరేటర్స్, మరియు ఇంటర్నెట్ సర్వీస్ ప్ర్రొవైడర్స్ ద్వారా బ్లాక్ చేయించింది.

కానీ సుప్రీం కోర్టు ఇటివల దీనిపై ఒక తీర్పును వెలువరించింది. అదేంటంటే ఇలాంటి వెబ్‌సైట్స్‌ను నిషేదించడమంటే వ్యక్తిగత స్వేచ్చను హరించడమే, ఓ పెద్ద మనిషి రహస్యంగా పోర్నోగ్రఫీ చూస్తే నష్టం ఏంటని కోర్టు ప్రశ్నించడం జరిగింది.

అయితే ఇలాంటి వన్నీ చిన్నారులు చూడకుండా కట్టడి చేయాలని సూచించింది. దీనికి కావాల్సిన చట్టపరమైన విధానాలు అమలు చేయాలని సూచించింది. దీనికి భిన్నంగా కేంద్రం వెబ్‌సైట్లపై నిషేదం విదించకుండా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కట్టడి చేసింది. 

ఇలా చేసినందుకు ఇంతవరకూ ఎవరూ ఎలాంటి స్పందన తెలపకపోయినా, వివాదాలకు మారుపేరు అయినా రామ్‌ గోపాల్ వర్మ మాత్రం దీనిపై స్పందించడం విశేషం.  ఇది తిరోగామి చర్య అంటూ వరుస ట్వీట్లు చేశారు. లైంగిక నేరాలను నిరోధించడానికి అశ్లీల సైట్లను నిషేధించడం పరిష్కారం కాదని ఆయన అభిప్రాయం తెలిపారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -