Tuesday, April 30, 2024
- Advertisement -

యాసంగిలో పంటల సాగు, కొనుగోలు పై కేసీఆర్ సమీక్ష

- Advertisement -

యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలు చేయడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30గంటలకు ప్రారంభం అయ్యే సమావేశంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటారు. యాసంగిలో ఏ పంట వేయాలి? ఏ పంట వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? ఏ పంట వేస్తే నష్టం? తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు.

‘‘కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్నది. దీని వల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శనివారం నాడు సమావేశంలో ఈ విషయంపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

కరోనా ముప్పు ఇంకా తొలగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సమీక్షిస్తారు.

‘‘కరోనా నేపథ్యంలో గత యాసంగి పంటలను గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించడం జరిగింది. ఇంకా కరోనా ముప్పు తొలగలేదు అందుకే వర్షా కాలం పంటలను కూడా గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి. 6 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. పంటలు కొనుగోలు చేసిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బులు చెల్లించాలి. దీని కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముందుగానే చేయాలి’’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

CM KCR special focus on women safety

Central Government Praises Telangana Rythu Bandhu Scheme

KCR Holds Review meeting on Regulatory Farm Policy Methods

YS Jagan’s special focus on irrigation projects

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -