ఇండియన్ సినిమాలో మల్టీస్టారర్ సినిమాలు కొత్తేమీ కాదు. వెండితెరపై తాము అభిమానించే నటుడు కనిపిస్తే ఉండే సంతోషం అంతా ఇంతకాదు. అలాంటిది ఇద్దరు అగ్రహీరోలు కలిసి నటిస్తే ఫ్యాన్స్‌కు పండగే. ఇప్పటివరకు ఇలా వెండితెరపై స్టార్ హీరోలు కలిసి నటించి మెప్పించారు కూడా.
తాజాగా మరో క్రేజీ మల్టీస్టారర్ వెండితెరపై రానుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
గతేడాది షారుఖ్‌తో సినిమా తీసి హిట్ కొట్టారు అట్లీ. ఈ సినిమాతో అల్లు అర్జున్‌తో మూవీ చేస్తారని వార్తలు వచ్చినా…చివరకు సల్మాన్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా మల్టీస్టారర్‌గా ఉండబోతోందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ముగింపు దశకు చేరుకోగా సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించనున్నారు. ఒకవేళ సల్మాన్ – రజనీ ఇద్దరు కలిసి వెండితెరపై సందడి చేస్తే అది అభిమానులకు ఖచ్చితంగా పండగే.