Sunday, May 5, 2024
- Advertisement -

బన్నీ తండ్రి.. ఇప్పుడు బన్నీకే విలన్ అయ్యాడు

- Advertisement -
Sarathkumar Turns Villain For Allu Arjun

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో. మొదటి సినిమా నుంచి డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న హీరో. అల్లు అర్జున్ తండ్రి పెద్ద నిర్మాత అయినప్పటికి.. ఓ మామూలు వ్యక్తిలా కనిపిస్తాడు బన్నీ. అయితే ఇటివలే బన్నీ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

{loadmodule mod_custom,GA1} 

సరైనోడు సక్సెస్ మీట్ లో పవన్ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ ని పవర్ స్టార్ అని చెప్పమనడంతో.. బన్నీ చెప్పను బ్రదర్ అనేసరికి.. అది పెద్ద రచ్చ రచ్చ అయింది. అయితే ఆ తర్వాత బన్నీ క్లారిటీ ఇచ్చిన పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. అయితే బన్నీ ప్రస్తుతం నటిస్తున్న సినిమా డీజే. హరిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ సంగతి అందిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఇక బన్నీ ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

{loadmodule mod_custom,GA2} 

అయితే గతంలో అల్లు అర్జున్ నటించిన బన్నీ సినిమాలో అల్లు అర్జున్ కి తండ్రిగా అద్భుతమైన పాత్రను శరత్ కుమార్ చేశారు. ఇప్పుడు నా పేరు సూర్య సినిమాలో శరత్ కుమార్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారట. అల్లు అర్జున్ కి విలన్ గా శరత్ కూమర్ నటిస్తున్నట్లు సమాచారం. గతంలో బన్నీకి తండ్రిగా నటించిన శరత్ కుమార్.. ఇప్పుడు బన్నీకి విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం హీరో అర్జున్ నటిస్తున్నాడు.

{youtube}Ob0REyngcd8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పై మళ్లీ కామెంట్ చేసిన అల్లు అర్జున్
  2. పక్కాగా పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్
  3. అభిమానులకు వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్
  4. అల్లు అర్జున్ కొడుకు.. ఎవరికి అభిమానో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -