Saturday, April 20, 2024
- Advertisement -

బాబోయ్ మాకొద్దీ వర్క్ ఫ్రమ్ హోం..

- Advertisement -

గతేడాది ప్రపంచదేశాలన్నింటినీ గడగడలాడించిన ఘనత కేవలం ఒక్క కరోనా మహమ్మారికే దక్కింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను.. ప్రజల జీవన విధానాన్ని మొత్తంగా తలకిందులు చేసేసి స్వైర విహారం చేసి.. ఎందరినో బలికొంది. ఈ కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వడమే కాకుండా.. ఎంతో మంది తమ ఉద్యోగాలను సైతం పోగొట్టుకున్నారు.

కాగా కొన్ని కంపెనీలు మాత్రం సంస్థనే పూర్తిగా మూసివేయకుండా వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అవలంభించాయి.అలాంటి కష్టకాలంలో ఉద్యోగాలను మొత్తానికే తీసెయ్యకుండా.. ఇంటినుంచే పనిచేసుకునే విధానంతో సంబురపడ్డారు ఉద్యోగులు. కానీ స్టార్టింగ్ లో ఈ కల్చర్ ను బాగా ఎంజాయ్ చేసిన జనాలు ఇప్పుడు.. ఇంట్రెస్ట్ చూపడం లేదట.

అయితే ఈ విషయాన్ని ప్రముఖ జాబ్స్ వెబ్ సైట్ ఇండీడ్ తెలియజేసింది. ఇది జరిపిన సర్వేలో దాదాపుగా 59 శాతం మంది ఉద్యోగులు ఈ వర్క్ ఫ్రమ్ హోం ఎత్తేసి.. ఎంచక్కా ఆఫీసుకు వెళ్తే బాగుండని భావిస్తున్నారట.అయితే మహిళలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోంనే కోరుకుంటున్నారట. అలాగే ఇప్పటికిప్పుడు ఆఫీసుకు వెళ్లాలని 50 శాతం ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఈ సర్వే వెళ్లడించింది.

‘శాకుంతలం’లో మోహన్ బాబు కీలక పాత్ర?

రెజ్లర్ రితిక ఫొగట్ ఆత్మహత్య

రజినీని ఢీ కొట్టబోతున్న జగ్గూభాయ్ !

వీరి కాంబినేషన్ సూపర్ హిట్టే..!

ఆ విషయంలో నేను బాలయ్యకు ఫిదా అయ్యాను

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -