Saturday, May 18, 2024
- Advertisement -

ఇండస్ట్రీలో లేకుండా చేస్తా.. చిన్న హీరోకి పెద్ద నిర్మాత వార్నింగ్

- Advertisement -

గత కొన్ని నెలల క్రితం చిన్న సినిమాల పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో అతి తక్కువ వ్యయంతో నిర్మితమై, తక్కువ సెంటర్స్‌లో విడుదలై… కనివిని ఎరుగని రీతిలో పెద్ద సినిమా లాగ హిట్‌ని సొంతం చేసుకున్నది ఒక చిన్న సినిమా…

అందులో 70% నటీ నటులు కొత్త వారే, అయినా ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చిన్న నిర్మాతలు మళ్ళీ పుంచుకుని సినిమాలు తీయాలని అనుకున్నారు. పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు తీస్తే రిస్క్ ఉండదు అని ఫీల్ అయ్యారు. అంతలా ఈ సినిమా ఇటు సినీ పరిశ్రమలోని పెద్దలను ప్రభావితం చేసింది.

 

 ఐతే ఈ సినిమాకు పెద్ద దిక్కు మాత్రం డైరెక్టరే… తర్వాత హీరోయిన్ అందాలు… స్టోరీ… ఇలా అన్ని కుదిరాయి. పోతే ఇక్కడ చిక్కేంటంటే ఈ సినిమా నా వల్లే హిట్ అయ్యిందని హీరో ఫీలయ్యాడు. అదే తడవుగా తనలో లేని హీరోయిజాన్ని అరువు తెచ్చుకున్నాడు. తను పెద్ద మెగా స్టార్‌గా ఊహించుకున్నాడు. ఒక హిట్ వస్తే ఆ సినిమాలోని వాళ్ళ అందరికి మంచి పేరు వస్తుంది. జనాలు కూడా వాళ్ళ వెంట తిరుగుతారు.  ఇక ప్రోడ్యూసర్‌లు అయితే ఆ హిట్‌ సినిమా హీరో ఇంటిముందు బ్రీఫ్‌కేసులతో సెంట్రీలాగా నిలబడతారు. ఆలా… ఓ… నిర్మాత… సదరు హీరోని కలిసి తన గురించి తన కథ గురించి చెప్తాడు. హీరో OK అన్నాడు.
 కాని రెమ్యూనరేషన్ గురించే చర్చ.. అటు ఇటు… మాటలు సాగాయి. మహా అయితే ఒక పది లక్షలు తీసుకుంటాడు. పోని ఇరవై లక్షలు అని అనుకుని వచ్చిన ఆ నిర్మాతకు చుక్కలు కనిపించే రేటు చెప్పాడు ఆ హిరో… కాళ్ళు, గడ్డాలు పట్టుకుని ఒక యాభైకి ఒప్పించారు. నిర్మాత అడ్వాన్స్‌ ఇచ్చి వెళ్ళాడు.. ఇక ఆ హీరోకి కొమ్ములుమొలిచాయి. మనకు ఎదురులేదు. అనుకున్న టైమ్‌లో ఇంకో కారు వచ్చింది. అందులోనుండి ఒక చిన్న నిర్మాత దిగాడు. హీరో ఫేస్‌లో ఏ ఫీలింగ్‌ లేదు. విషయం ఏంటీ ఇలా వచ్చావ్.. అని అడిగాడు. అదే రా… నీ ఫస్ట్ సినిమా షూటింగ్‌లో నేను నా next  movie కి అడ్వాన్స్ ఇచ్చాను కదా… అని ఇంకా ఏదో చెప్పేలోపే హీరో మద్యలో కలగజేసుకుని ఏంటీ అది రిటర్న్ ఇవ్వాల.. ఒక్క నిమిషం అంటూ పక్కనే ఉన్న బ్రీఫ్‌కేసు ఓపెన్ చేయబోయాడు. ఆబ్బే అది కాదురా…. స్టోరి ok అయ్యింది. next month నుండి shooting అన్నాడు.

ఇదివరకు ఉన్న్న చొరవలో… నేను హీరోని నన్ను రా….. అనకు అని చిరుగ్గా చెప్పాడు. సరే అనుకుని ఆ నిర్మాత బాబు అని సంబోదించాడు. సరే నీకు సినిమా చేస్తా కాని ముందు అనుకున్న 5 కు కాదు.. 70లక్షలు నా రెమ్యూనరేషన్ అని అనగానే ఒక నిమిషం హార్ట్ ఆగిపోయింది.. ఆనిర్మాతకి.. మన అగ్రిమెంట్‌లో 5లక్షలే కదా ఉంది. అనగానే అదేదో అప్పుడు తెలియకుండా రాసుకుంది. అది చింపేసి వేరే కొత్తగా రాసుకుందాం అన్నాడు. ఆ నిర్మాత ఎంతో బతిమాలాడు. చివరికి 30లక్షలు అన్నాడు. 70కి ఒక రూపాయి తక్కువైన చేయను అన్నాడు. నా సినిమా బడ్జెట్ కాదు అన్నాడు. అందులో 70 నీకు ఇస్తే ఇక నేను సినిమా ఎలా తీయను అనగానే.. నేను నిన్ను సినిమా తీయమని అడిగానా… తీయకు ఊరికే ఇంట్లో ఉండు. అని లోనికి వెళ్ళి పోయాడు…
బరువెక్కిన గుండెను పట్టుకుని ఆ నిర్మాత తన ఇంటివైపు వెళుతూ… ఈ హీరో గత ఆరు నెలల క్రితం తన దగ్గర ఎలా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఇంటికొచ్చాడు. వారం, నెల.. ఇలా రోజు హీరోకి call చేస్తున్నాడు. వెళ్ళి కనిపిస్తున్నాడు. ఐన ఆ హీరో మనసు కొంచెం కూడా కరగలేదు. కోపం వచ్చిన ఆ చిన్న నిర్మాత ఎపుడు cool గా ఉండే ఒక  పెద్ద నిర్మాత దగ్గరికి వెళ్ళి తనగోడుని వినిపించాడు. కోపంతో ఊగిపోయినా ఆ పెద్ద నిర్మాత ఆ హీరోని సినిమా చేద్దాం రా.. అని పిలిపించి కొట్టేంత పనిచేసి ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు.

నువ్వెంత నీ బతుకెంత అసలు హీరో ఫేసేనా రా.. నీది.. ఆ సినిమాలో నువ్వు కాదు ఊర కుక్కను పెట్టినా ఆ సినిమా హిట్టేరా… ఏదో ఆ డైరెక్టర్ పుణ్యమా అని సినిమా హిట్ అయితే అది నీ గొప్పగా చెప్పుకుంటావా… ఇలా అయితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తా జాగ్రత్త.. నువ్వు ఈ నిర్మాతకి ముందు చేసుకున్న ప్రకారం సినిమా చేయి లేదంటే 50లక్షలు ఇవ్వు.. అనగానే ఆ హీరోకి చలి జ్వరం వచ్హి సినిమా చేస్తా అని అన్నాడు. కాని ఆ చిన్న నిర్మాత వద్దు సార్ నేను ఇక సినిమా చేయను అన్నాడు. ఐతే 50లక్షలు తీసుకో అనగానే  నేను నా క్యారెక్టర్‌ని పొగొట్టుకోను సార్.. నా పరిస్తితి ఇక వేరే నిర్మాతకి రాకూడదు అని మీతో చెప్పాను.
 నా 5లక్షలు ఇస్తే చాలు అని అవి తీసుకుని వెళ్ళిపోయాడు ఆ నిర్మాత….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -