తూచ్.. గురంట్లపై చర్యలు తీసుకోవట్లే ..!

ఇటీవల దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో పై ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైందో అందరికీ తెలిసిందే. జాతీయ మీడియాలో సైతం కథనాలు వెలువడడంతో జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ పరువును మంటకలిపారాని వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ న్యూడ్ వీడియో తనది కాదని, అది మార్ఫింగ్ వీడియో అని గోరంట్ల చెబుతున్నప్పటికి, విమర్శలు మాత్రం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో ఒక ఎంపీ మహిళాతో నగ్నంగా కాల్ మాట్లాడినా వీడియో బయటకు వచ్చినప్పటికి వైసీపీ ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో వైఎస్ జగన్ వైఖరిపై కూడా తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.

అయితే ఆ వీడియో గోరంట్లదే అని రుజువైతే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన విషయం విధితమే. అయితే తాజాగా ఆయన ఈ విషయంపై భిన్నంగా స్పందించడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇటీవల ప్రెస్ మెట్ లో గోరంట్లపై చర్యలు తీసుకోవడంపై స్పందించిన సజ్జల.. మాధవ్ న్యూడ్ వీడియోను, చంద్రబాబు ఓటుకు నోటు అంశానికి ముడిపెట్టారు. ” ఓటుకు నోటు కేసులో బయటపడ్డ చంద్రబాబు ఆడియోపై ఇంతవరకు స్పష్టత రాలేదు.. అలాగే మాధవ్ న్యూడ్ విడియో కూడా రియలా ? లేక ఫెకా ? అనే దానిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు.

ఇంతవరకు ఏ మహిళా తనను మాధవ్ లైంగికంగా వేధించడాని ఫిర్యాదు చేయలేదని, అలా ఫిర్యాదు చేసి ఉంటే చర్యలు తీసుకునేవాళ్ళమని సజ్జల అన్నారు. అంతే కాకుండా మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దదని చెప్పుకొచ్చారు:”. సజ్జల చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే గోరంట్లపై ఎలాంటి చర్యలు ఉండవనే అంశాన్ని చెప్పనే చప్పనట్లు అర్థమౌతోంది. గోరంట్లపై చర్యలు తీసుకోవడంలో వైసీపీ దాటివేసే ధోరణి ప్రవర్తిస్తే.. కచ్చితంగా అది పార్టీ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ముందు రోజుల్లో జగన్.. గోరంట్ల న్యూడ్ వీడియో వ్యవహారంపై ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.

Also Read

నేతలు మారితే ఓటర్లు మారతారా ..!

మోడీ జోక్యంతో.. జగన్ వెనక్కి తగ్గుతాడా ?

కే‌సి‌ఆర్ ” పింఛన్ ” వ్యూహం.. ఫలిస్తుందా ?

Related Articles

Most Populer

Recent Posts