Thursday, May 16, 2024
- Advertisement -

అమ్మో..అగ్రహీరోలతో సినిమానా!

- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. చిన్న హీరోలతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఎందుకంటే చిన్న సినిమాలు ఏ అంచనా లేకుండా వచ్చి భారీ హిట్ సొంతం చేసుకుంటున్నాయి. అందుకే ఒకప్పుడు అగ్రహీరోల డేట్స్ కోసం వేచిఉండి వారు టైం ఇచ్చినప్పుడే సినిమాలు తీసేవారు. ఇంకా చెప్పాలంటే రెమ్యునరేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చి సంవత్సరాలు తరబడి వేచిచూసేవారు. ఇక ఒక హీరో సినిమా హిట్ అయి మంచి పాపులారిటీ వస్తే చాలు…కథ ఫైనల్ కాకుండానే సినిమా హీరోకు డబ్బులిచ్చి బుక్ చేసుకునే వారు. కానీ ప్రస్తుతం పూర్తిగా ట్రెండ్ మారిపోయింది.

ఎందుకంటే సినిమా బడ్జెట్ పెరిగిపోవడం ఒక కారణమైతే హీరో రెమ్యునరేషన్ అమాంతం పెంచేయడం మరో కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క అగ్రహీరోకు ఇచ్చే రెమ్యునరేషన్‌తో చిన్న సినిమాలు నాలుగైదు తీసే పరిస్థితి వచ్చింది.

ప్రస్తుతం అగ్రహీరోలంతా రూ.50 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రభాస్,పవన్,ఎన్టీఆర్,మహేష్‌,బన్ని,చరణ్‌ల గురించి చెప్పాల్సిన పనేలేదు. వీరంతా దాదాపు రూ. 80 కోట్ల నుండి రూ.100 కోట్ల రెమ్యునరేషన్‌ని డిమాండ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాకు 90 కోట్ల రెమ్యూనరేషన్ ను అడుగుతున్నారట. రానురాను హీరోల రెమ్యునరేషన్ పెరిగిపోతుండటంతో నిర్మాతలు కూడా వెనుకంజ వేసే పరిస్ధితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -